Simhachalam: కృష్ణాపురం గోశాల సిబ్బందికి ప్రశంసాపత్రాలు అందజేసిన ఈవో!

Simhachalam: శ్రీ వరాహ లక్ష్మీ నరసింహస్వామి వారి దేవస్థానం ఆధ్వర్యంలో నిర్వహించిన దేవాదాయ శాఖ శిక్షణా సంస్థ మూడు రోజుల ప్రత్యేక గోసంరక్షణ శిక్షణ ముగిసింది.

GOPI, PENDURTHI
Published on: 9 July 2026 6:45 PM IST
Simhachalam: కృష్ణాపురం గోశాల సిబ్బందికి ప్రశంసాపత్రాలు అందజేసిన ఈవో!
X

Simhachalam: కృష్ణాపురం గోశాల సిబ్బందికి ప్రశంసాపత్రాలు అందజేసిన ఈవో!

సింహాచలం, జూలై 9: శ్రీ వరాహ లక్ష్మీ నరసింహస్వామి వారి దేవస్థానం ఆధ్వర్యంలోని కృష్ణాపురం గోశాలలో రాష్ట్ర దేవాదాయ శాఖ శిక్షణా సంస్థ (సీత) నిర్వహించిన మూడు రోజుల ప్రత్యేక శిక్షణ కార్యక్రమం గురువారం విజయవంతంగా ముగిసింది.

ఈ సందర్భంగా దేవస్థానం కార్యనిర్వహణాధికారి జల్లేపల్లి వెంకట్రావు శిక్షణ కార్యక్రమంలో సేవలందించిన పశుసంవర్థక శాఖ రిటైర్డ్ జాయింట్ డైరెక్టర్ శర్మ, డా. గౌతమ్లను సన్మానించి, స్వామివారి ప్రసాదాలు అందజేశారు.

అనంతరం శిక్షణ కార్యక్రమంలో పాల్గొన్న వివిధ దేవాలయాల గోశాలల సూపర్వైజర్లు, సూపరింటెండెంట్లు, క్లర్కులు, కృష్ణాపురం గోశాల సిబ్బంది, శిక్షకులు, ప్రతినిధులకు ఈవో జల్లేపల్లి వెంకట్రావు చేతుల మీదుగా ప్రశంసాపత్రాలు అందజేశారు.

గోసంరక్షణ, గోశాలల సమర్థ నిర్వహణకు ఈ శిక్షణ ద్వారా పొందిన అవగాహనను ఆయా దేవాలయాల్లో అమలు చేసి ఆదర్శ గోశాలలుగా తీర్చిదిద్దాలని ఆయన సూచించారు.

ఈ సందర్భంగా ఈవో మాట్లాడుతూ, గోశాలల నిర్వహణలో శాస్త్రీయ విధానాలు, పరిశుభ్రత, పశువుల ఆరోగ్య సంరక్షణ, పంచగవ్య ఉత్పత్తుల ప్రోత్సాహం వంటి అంశాల్లో సిబ్బంది మరింత నైపుణ్యం సాధించేందుకు ఇటువంటి శిక్షణ కార్యక్రమాలు ఎంతో ఉపయోగపడతాయని తెలిపారు. రాష్ట్రవ్యాప్తంగా దేవాలయ గోశాలల అభివృద్ధికి ఈ కార్యక్రమం దోహదపడుతుందనే ఆశాభావం వ్యక్తం చేశారు.

ఈ కార్యక్రమంలో ఇన్‌చార్జి పర్యవేక్షణాధికారి మూలా వాసు, సీత సీనియర్ సహాయకులు లక్ష్మణస్వామి, గోశాల సిబ్బంది, వివిధ దేవాలయాల ప్రతినిధులు తదితరులు పాల్గొన్నారు.

GOPI, PENDURTHI

GOPI, PENDURTHI

Next Story