Chodavaram: 295 అంగన్‌వాడీ కేంద్రాలకు ఇండక్షన్ స్టవ్‌ల పంపిణీ!
Chodavaram: రావికమతంలో 295 అంగన్‌వాడీ కేంద్రాలకు ఇండక్షన్ స్టవ్‌లు, వంట పాత్రలు పంపిణీ. చోడవరం ఎమ్మెల్యే కేఎస్‌ఎన్‌ఎస్ రాజు సూచనలతో ఆధునిక వంట విధానానికి శ్రీకారం.
Chodavaram: 295 అంగన్‌వాడీ కేంద్రాలకు ఇండక్షన్ స్టవ్‌ల పంపిణీ!
Chodavaram: ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం కాలుష్య నియంత్రణ, ఇంధన పొదుపు మరియు ఆధునిక సాంకేతికత వినియోగాన్ని ప్రోత్సహించే దిశగా అంగన్‌వాడీ కేంద్రాలకు ఇండక్షన్ స్టవ్‌ల పంపిణీ కార్యక్రమాన్ని వేగవంతం చేసింది. ఇందులో భాగంగా చోడవరం శాసనసభ్యులు శ్రీ కె.యస్.ఎన్.యస్. రాజు ఆదేశాల మేరకు/ఆధ్వర్యంలో రావికమతం మండలానికి చెందిన 295 అంగన్‌వాడీ కేంద్రాలకు ఇండక్షన్ స్టవ్‌లు మరియు వంట పాత్రలను పంపిణీ చేశారు.
ఈ సందర్భంగా ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్ర కాపు కార్పొరేషన్ డైరెక్టర్ రాజాన కొండ నాయుడు,మండల పార్టీ అధ్యక్షులు కోమటి శంకరరావు, మేడిచర్ల నాయుడు, గోటాల చిన్న అధికారులు MPDO గారు,ICDS మేడమ్ గారు మాట్లాడుతూ
ఇంధన పొదుపు & ఆదా: ఇప్పటివరకు ఎల్పీజీ (LPG) గ్యాస్‌పై ఆధారపడి నడుస్తున్న అంగన్‌వాడీ కేంద్రాల్లో విద్యుత్ వినియోగాన్ని ప్రోత్సహించడం, కాలుష్యాన్ని తగ్గించడం మరియు నిర్వహణ ఖర్చులను ఆదా చేయడమే ఈ పథకం ముఖ్య ఉద్దేశం. దీనివల్ల ఒక్కో కేంద్రానికి నెలకు సుమారు ₹247 వరకు లబ్ధి చేకూరుతుంది.
కార్యకర్తల పాత్ర: అంగన్‌వాడీ కేంద్రాలు తల్లి–బిడ్డల సంక్షేమానికి, చిన్నారుల పోషణకు మరియు పూర్వ ప్రాథమిక విద్యకు కేంద్ర బిందువులు. కార్యకర్తలు నిబద్ధతతో సేవలు అందించి చిన్నారుల బంగారు భవిష్యత్తుకు పునాదులు వేయాలి.
ప్రభుత్వ ప్రాధాన్యత: అంగన్‌వాడీ కేంద్రాలకు అవసరమైన మౌలిక వసతుల కల్పన, తల్లి–శిశు సంక్షేమం మరియు చిన్నారుల సర్వాంగీణ అభివృద్ధికి కూటమి ప్రభుత్వం నిరంతరం కట్టుబడి పనిచేస్తోంది.
ఈ కార్యక్రమంలో సర్పంచ్ గంజి మోది నాయుడు,ఎంపీటీసీలు గంజి సూర్యనారాయణ,వేపాడ నాగేశ్వరావు, గంపవానిపాలెం ఎంపీటీసీ రాజు, తాతలు,కోపరేటివ్ ప్రెసిడెంట్ నాగేశ్వరావు,గంజి ఈశ్వరావు, ఐసీడీఎస్ (ICDS) అధికారులు మరియు అంగన్‌వాడీ కార్యకర్తలు, ఆయాలు పాల్గొన్నారు.




