Anakapalli: డి.ఎల్.పురంలో ఆర్సెలర్ మిట్టల్ పోర్టు ప్రజాభిప్రాయ సేకరణ!
Anakapalli: అనకాపల్లి జిల్లా డి.ఎల్.పురంలో ఆర్సెలర్ మిట్టల్ పోర్టుపై ప్రశాంతంగా ప్రజాభిప్రాయ సేకరణ. నిర్వాసితులకు, మత్స్యకారులకు న్యాయం చేస్తామన్న కలెక్టర్ విజయకృష్ణన్.
Anakapalli: డి.ఎల్.పురంలో ఆర్సెలర్ మిట్టల్ పోర్టు ప్రజాభిప్రాయ సేకరణ!
Anakapalli: అనకాపల్లి జిల్లాలో నక్కపల్లి మండలంలోని డి.ఎల్ పురం వద్ద ఆర్సీలర్ మిట్టల్ స్టీల్ ప్లాంట్ కోసం నిర్మించనున్న పోర్టు కి సంబంధించి ప్రజాభిప్రాయ సేకరణ నిర్వహించారు.ఆ పోర్టు నిర్మాణం కు డి.ఎల్.పురం లో నిర్వహిస్తున్న ప్రజాభిప్రాయ సేకరణ కు అధికారులు ఏర్పాట్లు చేసిన సభా ప్రాంగణం వద్దకు జిల్లా కలెక్టర్ విజేయకృష్ణన్ తో పాటు జిల్లా అధికారులు హాజరయ్యారు.పొల్యూషన్ కంట్రోల్ బోర్డ్ ఆధ్వర్యంలో జరిగిన ప్రజాభిప్రాయ సేకరణ ప్రశాంతంగా జరిగింది.
పలువురు పోర్ట్ రావడం పట్ల యువత కు ఉద్యోగాలు వస్తాయని హర్షం వ్యక్తం చేశారు. మరి కొందరు ఈ ప్రాంతంలో పోర్ట్ రావడం వల్ల ఈ ప్రాంతం అభివృద్ధి చెందుతుందని తెలిపారు. మరికొందరు మాత్రం ఈ ప్రాంతంలో పోర్టు కోసం భూములు ఇచ్చిన రైతులకు న్యాయం చేయాలని కోరారు.అలాగే స్థానికులకు ఉద్యోగాలు ఇవ్వాలని డిమాండ్ చేశారు. ఈ పోర్టు కారణంగా నష్టపోతున్న మత్యకారుల ను ఆదుకోవాలని కోరారు.ఈ సమస్యలను పరిస్కారం కు కృషి చేస్తామని జిల్లా కలెక్టర్ విజయ కృష్ణన్ తెలిపారు.అనకాపల్లి జిల్లా అభివృద్ధి పధంలో ముందుకు దూసుకుపోతోందన్నారు.
రైతులు కొందరికి మాట్లాడే అవకాశం రాకపోవడంతో రైతులు కొంత అసహనం వ్యక్తం చేశారు.అనకాపల్లి ఎస్.పి తుహిన్ సిన్హా ఆదేశాల మేరకు ప్రజాభిప్రాయ సేకరణ వద్ద పోలీసులు భారీ బందోబస్తు నిర్వహించారు. ఎటువంటి అవాంఛనీయ సంఘటనలు తలెత్తకుండా నర్సీపట్నం డి.ఎస్.పి శ్రీనివాసరావు ఆధ్వర్యంలో నక్కపల్లి ,పాయకరావుపేట ,అడ్డురోడ్డు సర్కిల్ ఇన్స్పెక్టలు మురళి ,వినోద్ బాబు ,రామకృష్ణ లు తగు జాగ్రత్తలు తీసుకున్నారు.




