Visakhapatnam: విశాఖలో ఘనంగా ప్రపంచ దోమల దినోత్సవ వేడుకలు!

Visakhapatnam: విశాఖపట్నం డీఎంహెచ్‌ఓ కార్యాలయంలో ప్రపంచ దోమల దినోత్సవం. దోమల నివారణపై అవగాహన ర్యాలీ, సత్యం జంక్షన్ వరకు నిర్వహించిన వైద్యాధికారులు.

SHIVA, BHIMILI
Published on: 21 Aug 2026 10:08 AM IST
Visakhapatnam
X

Visakhapatnam: విశాఖలో ఘనంగా ప్రపంచ దోమల దినోత్సవ వేడుకలు!

Visakhapatnam: ప్రపంచ దోమల దినోత్సవం సందర్భముగా జిల్లా వైద్య ఆరోగ్య శాఖ కార్యలయములో జిల్లా వైద్య ఆరోగ్య శాఖాధికారి వారు హాజరైన ANM, ASHAs, NMEP సబ్ యూనిట్, AM యూనిట్ గాజువాక, GVMC సిబ్బంది, DMO ఆఫీస్ సిబ్బంది మరియు ఇతర సిబ్బంది ని ఉద్దేశించి మాట్లాడుతూ-1897లో ఆగస్టు 20న సర్ రోనాల్డ్ రాస్ అనే బ్రిటిష్ డాక్టర్ "ఆడ అనాఫిలిస్ దోమ కుట్టడం వల్లనే మలేరియా వస్తుంది" అని కనుగొన్నారు. ఆయన కనుగొన్న రోజునే గుర్తుగా ప్రతి ఏడాది ఆగస్టు 20న World Mosquito Day జరుపుకుంటాం.

సర్ రోనాల్డ్ రాస్ కు 1902లో వైద్యశాస్త్రంలో నోబెల్ బహుమతి కూడా వచ్చింది. 2026 థీమ్/లక్ష్యం మనందరం కలిసి ముందుకు అడుగు వేస్తే దోమలను నిర్మూలించడం, వ్యాధులను నియంత్రించగలం, ఆరోగ్యకరమైన సమాజాన్ని నిర్మించగలం. దోమల వల్ల వచ్చే వ్యాధుల గురించి ముఖ్యంగా మలేరియా, డెంగ్యూ, చికున్ గున్యాగురుంచి, జికా మరియు ఫైలేరియా గురుంచి అవగాహన కల్పించడం. దోమల బారి నుండి రక్షణకు ప్రజలలో క్రింది విషయాలలో అవగాహన కల్పించాలని ఆదేశించారు.

నీరు నిల్వ ఉంచవద్దు: కూలర్, పూల కుండీలు, టైర్లలో నీరు నిల్వ చేయొద్దు. వారానికి ఒకసారి శుభ్రం చేయాలి.

దోమతెర వాడండి: ముఖ్యంగా పిల్లలు, గర్భిణీలు రాత్రి దోమతెర తప్పనిసరి.

ఫుల్ స్లీవ్స్ దుస్తులు: ఉదయం, సాయంత్రం దోమలు ఎక్కువగా ఉంటాయి.

దోమల కాయిల్/లిక్విడ్: కానీ గదిలో గాలి ఉండేలా చూడాలి పరిసరాలు శుభ్రంగా ఉంచడం చెత్త, మురుగు నీరు లేకుండా చూడాలి. తరువాత జిల్లా మలేరియా అధికారి గారు మాట్లాడుతూ, ఈ రోజు ఉద్దేశ్యం "దోమలను నిర్మూలించడం = వ్యాధులను నిర్మూలించడం" అని వివరించారు. అలాగే అవగాహన ర్యాలీలు పాఠశాలలు, PHC, UPHC, కళాశాలల విద్యార్థులతో "దోమలు లేని ఇల్లు - వ్యాధులు లేని ఊరు" అనే నినాదంతో ర్యాలీలు పాఠశాలలు &కళాశాలల్లో వ్యాసరచన, వ్యాస, పోస్టర్ పోటీలు.

"దోమలను ఎలా నివారించాలి" అనే టాపిక్‌పై నాటకాలు, స్కిట్స్ దోమల వల్ల వచ్చే వ్యాధుల గురించి విద్యార్థులతో - స్వచ్ఛ భారత్ + దోమల నిర్మూలన: పాఠశాల ప్రాంగణం శుభ్రం చేయడం

TV, రేడియో, సోషల్ మీడియా: APCHFW, WHO వారు #World Mosquito Day #Fight The Bite అనే హ్యాష్‌ట్యాగ్‌లతో అవగాహన వీడియోలు - SMS/వాట్సాప్ మెసేజ్‌లు "వారానికి ఒకసారి నీరు మార్చండి" లాంటి సందేశాలు శ్రీ బి.నాగేశ్వర రావు వారు జిల్లా మాస్ మీడియా అధికారి హాజరైన సిబ్బంది మరియు అధికారులతో ప్రతిజ్ఞ చేయించారు అనంతరము DM&HO కార్యాలయము నుంచి ర్యాలి నిర్వహించి నినాదాలిస్తూ సత్యం జంక్షన్ వరకు వెళ్లి ప్రజలలో అవగాహన కల్పిస్తూ తిరిగి కార్యాలయమునకు చేరుకున్నారు.

ఈ కార్యక్రమం లో జిల్లా ప్రోగ్రాం అధికారులు డా.లూసి,డి.ఐ.ఒ, డా.హారిక, ఆర్.బి.ఎస్.కె.జిల్లా సమన్వయకర్త, రిజర్వ్ వైద్య సిబ్బంది డా.బాలాజీ, డా.నళిని, డా.రవి కిరణ్, శ్రీ వరప్రసాద్ రెడ్డి, జిల్లా మలేరియా అధికారి, శ్రీమతి సయ్యద్ బేగం డిప్యూటీ హెచ్.ఇ.ఒ, శ్రీ బి.నాగభూషణం అసిస్టెంట్ మలేరియా అధికారి, మరియు శ్రీ పి.సాంబమూర్తి, బయాలజిస్ట్, ఎ.పి.ఎం.ఒ లు, మర్లేరియా సిబ్బంది, ఆరోగ్య శాఖ సిబ్బంది పాల్గొన్నారు.


SHIVA, BHIMILI

SHIVA, BHIMILI

Next Story