Anakapalli: పెను ప్రమాదం తృటిలో తప్పింది.. డివైడర్ దాటి దూసుకెళ్లిన వోల్వో బస్సు!
Anakapalli: అనకాపల్లి జిల్లా ఎస్.రాయవరం వద్ద తప్పిన భారీ బస్సు ప్రమాదం. నిద్రమత్తులో ఉన్న డ్రైవర్ వల్ల డివైడర్ దాటిన వోల్వో బస్సు.
Anakapalli: పెను ప్రమాదం తృటిలో తప్పింది.. డివైడర్ దాటి దూసుకెళ్లిన వోల్వో బస్సు!
ఆనకాపల్లి జిల్లా: ఎస్.రాయవరం మండలం గోకులపాడు వద్ద గల డాల్పిన్ హోటల్ బంక్ సమీపంలో తృటిలో తప్పిన భారీ ప్రమాదం.
విశాఖ నుండి హైదరాబాద్ వెళ్తున్న ప్రయివేటు వోల్వో బస్సు ప్రమాదానికి గురయ్యింది.
డ్రైవర్ నిద్రమత్తులో ఉండడంతో ఈ వోల్వో బస్సు డివైడర్ దాటి రాజమండ్రి నుండి విశాఖ వైపు కి వెళ్లినట్లు సమాచారం.
ఆ సమయంలో అటువైపు గా ఏ వాహనాలు రాకపోవడంతో సురక్షితంగా బయటపడ్డ ప్రయాణికులు. ఎవరికీ ఏ ప్రమాదం జరగకపోవడం వల్ల ఊపిరి పీల్చుకున్న ప్రయాణికులు.
జాతీయ రహదారిపై ఈ ప్రమాదం జరగడంతో భారీగా నిలిచిపోయిన ట్రాఫిక్. కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్న ఎస్.రాయవరం పోలీసులు.
Next Story




