Visakhapatnam: ముసాయిదా ఓటరు జాబితాలో పేరు లేదా? ఎన్నికల సంఘం మరో అవకాశం!

Visakhapatnam: విశాఖపట్నం జిల్లాలో SIR 2026 ముసాయిదా ఓటరు జాబితాలో పేర్లు లేని వారికి తుది జాబితాలో పేరు పొందుపరిచేందుకు భారత ఎన్నికల సంఘం మరో అవకాశం కల్పించింది.

SHIVA, BHIMILI
Published on: 10 Nov 2026 11:04 AM IST
Visakhapatnam
X

Visakhapatnam: ముసాయిదా ఓటరు జాబితాలో పేరు లేదా? ఎన్నికల సంఘం మరో అవకాశం!

Visakhapatnam: ప్రత్యేక తీవ్ర సవరణ (SIR) 2026 ప్రక్రియలో భాగంగా జులై 31న ప్రచురించిన ముసాయిదా ఓటరు జాబితాలో పేర్లు చోటు చేసుకోని వారికి తుది ఓటరు జాబితాలో పేరు నమోదు చేసుకునేందుకు భారత ఎన్నికల సంఘం మరొక అవకాశం కల్పించినట్లు విశాఖ జిల్లా కలెక్టర్,జిల్లా ఎన్నికల అధికారి తెలిపారు.

​ఇంటింటి విచారణ సమయంలో ఆబ్సెంట్, షిఫ్టెడ్, డెడ్, డూప్లికేట్ వంటి కారణాలతో ASDD జాబితాలో చేర్చబడి, ఎన్యుమరేషన్ ఫారాలు అందని ఓటర్లకు ఈ వెసులుబాటు వర్తిస్తుంది. బూత్ వారీ ASDD జాబితాలను CEO/జిల్లా వెబ్సైట్లు, సంబంధిత పోలింగ్ కేంద్రాలు, పంచాయతీ, మున్సిపల్, ERO, AERO కార్యాలయాల్లో ప్రదర్శిస్తారు. పాక్షికంగా నింపిన ఫారాలను BLOల ద్వారా అందజేస్తారు.

అలాగే పాత EPIC నంబర్‌తో ECINET యాప్ లేదా ఎన్నికల వెబ్సైట్ ద్వారా డౌన్‌లోడ్ చేసుకోవచ్చు. ఎన్యుమరేషన్ ఫారంతో పాటు అనుబంధం-B డిక్లరేషన్‌ను భౌతికంగా లేదా ECINET ద్వారా ఆన్‌లైన్‌లో సమర్పించాలి. ఫారం-8 అవసరం లేకుండా, కొత్త చిరునామా వివరాలతో ఎన్యుమరేషన్ ఫారం, అనుబంధం-C, నివాస ధ్రువీకరణ పత్రాన్ని కొత్త నియోజకవర్గ ERO/AEROలకు అందించాలి.

దరఖాస్తులను రూల్ 21(1) ప్రకారం పరిశీలించి, అర్హులైన వారికి పాత EPIC నంబర్‌నే కేటాయిస్తూ నవంబర్ 30, 2026న ప్రచురించే తుది ఓటరు జాబితాలో పేరు చేర్చుతారు. ఇప్పటికే ఫారం-6 సమర్పించిన వారు మళ్లీ దరఖాస్తు చేయాల్సిన అవసరం లేదు.

SHIVA, BHIMILI

SHIVA, BHIMILI