Madhurawada: విశాఖలో కేంద్ర ఎన్నికల సంఘం అధికారుల తనిఖీ!
Madhurawada: మధురవాడ ఎంవీవీ సిటీలో జరుగుతున్న ప్రత్యేక ఓటర్ల సంక్షిప్త సవరణ కార్యక్రమాన్ని ఈసీఐ ప్రిన్సిపల్ సెక్రటరీ అవినాష్ కుమార్ క్షేత్రస్థాయిలో పరిశీలించారు.
Madhurawada: విశాఖలో కేంద్ర ఎన్నికల సంఘం అధికారుల తనిఖీ!
Madhurawada: విశాఖ మధురవాడ లోని ఎంవీవీ సిటీలో జరుగుతున్న ప్రత్యేక ఓటర్ల సంక్షిప్త సవరణ కార్యక్రమం-2026 ను గురువారం కేంద్ర ఎన్నికల సంఘం ప్రిన్సిపల్ సెక్రటరీ అవినాష్ కుమార్,అండర్ సెక్రటరీ సంజయ్ కుమార్ లతో కలిసి క్షేత్రస్థాయిలో పరిశీలించారు.జూన్15 నుండి జూలై14 వరకు జరుగుతున్న ఈప్రత్యేక డ్రైవ్‌లో భాగంగా అధికారులు ఓటర్ల నమోదు,సవరణల ప్రక్రియను తనిఖీ చేశారు.
ఈసందర్భంగా వారు కాలనీ రెసిడెంట్స్ వెల్ఫేర్ అసోసియేషన్ సభ్యులతో మాట్లాడారు.అర్హులైన పౌరులందరూ బూత్ లెవల్ అధికారులకు సహకరించాలని,ఈసీఐ ఓటర్ సర్వీసెస్ యాప్ ద్వారా తమ వివరాలను సరిచూసుకోవాలని కోరారు. అనంతరం బీఎల్ఓలు నిర్వహిస్తున్న ఇంటింటి సర్వే దరఖాస్తుల స్వీకరణ తీరును సమీక్షించి,సిబ్బంది పనితీరుపై సంతృప్తి వ్యక్తం చేశారు.ఈతనిఖీలలో జీవీఎంసీ కమిషనర్ కేతన్ గార్గ్,భీమిలి ఆర్డీఓ సంగీత్ మధుర్, మధురవాడ,భీమిలి జోన్ల జోనల్ కమిషనర్లు అయ్యప్ప నాయుడు ఈఆర్ఓలు,ఇతర ఎన్నికల అధికారులు పాల్గొన్నారు.




