Narsipatnam: నర్సీపట్నం అధికారుల నిర్లక్ష్యంతో వృద్ధుడి ఆమరణ దీక్ష!
Narsipatnam: నర్సీపట్నం ఆర్డీఓ కార్యాలయం వద్ద వృద్ధుడు సాగి విశ్వనాథరాజు ఆమరణ నిరాహార దీక్ష. డ్రైనేజీ మురుగునీటి సమస్యపై స్పందించని అధికారుల వైఖరికి నిరసన.
Narsipatnam: నర్సీపట్నం అధికారుల నిర్లక్ష్యంతో వృద్ధుడి ఆమరణ దీక్ష!
Narsipatnam: నర్సీపట్నం ఆర్డిఓ కార్యాలయం వద్ద సాగి విశ్వనాథరాజు అనే వృద్ధుడు సోమవారం ఆమరణ నిరాహార దీక్ష ప్రారంభించారు. బ్యాంక్ కాలనీలో నివసించే ఆయన ఇంటి పక్కనే ఉన్న ఖాళీ స్థలంలో మురుగునీరు చేరడంతో గతంలో అనేక సార్లు మున్సిపల్ అధికారులకు ఫిర్యాదు చేశామన్నారు. కానీ మున్సిపల్ అధికారులు పట్టించుకోలేదని ఆవేదనతో నిరాహారదీక్షకు కూర్చున్నానని తెలిపారు. సమస్య పరిష్కారం అయ్యేంతవరకు దీక్ష చేస్తానన్నారు.
Next Story




