Bheemili: రాబోయే మూడేళ్లలో ప్రతి పేదవాడికి సొంతింటి కల నిజం గంటా!

Bheemili: రాబోయే మూడేళ్లలో ప్రతి పేదవాడికి సొంతింటి కల నిజం చేస్తామని భీమిలి ఎమ్మెల్యే గంటా శ్రీనివాసరావు స్పష్టం చేశారు. ఇళ్ల పట్టాల పంపిణీలో ఆయన మాట్లాడారు.

SHIVA, BHIMILI
Published on: 5 Oct 2026 6:35 PM IST
Bheemili
X

Bheemili: రాబోయే మూడేళ్లలో ప్రతి పేదవాడికి సొంతింటి కల నిజం గంటా!

Bheemili: రాబోయే మూడేళ్లలో ప్రతి పేదవాడికి సొంతింటి కల నిజం చేస్తామని భీమిలి ఎమ్మెల్యే గంటా శ్రీనివాసరావు అన్నారు. ఎంపీడీఓ కార్యాలయం సమావేశం మందిరంలో సోమవారం ఇళ్ల పట్టాల పంపిణీ కార్యక్రమంలో ఆయన మాట్లాడుతూ జిల్లాలో రూ.8,874 కోట్ల విలువైన భూమిని 28 వేల మందికి ఇళ్ల పట్టాల రూపంలో అందించామని, భీమిలి నియోజకవర్గంలో పంపిణీ చేసిన భూమి విలువ రూ.886 కోట్లుగా పేర్కొన్నారు. గత నెల 19న విశాఖలో, 23న విజయవాడలో కలిపి 52 వేల మంది పేదలకు ఇళ్ల పట్టాలను ఇచ్చామన్నారు.

ఈనెల 4 న 3 డి కాంక్రీట్ ప్రింటింగ్ టెక్నాలజీతో 3 లక్షల ఇళ్ల నిర్మాణానికి సీఎం చంద్రబాబు, కేంద్ర మంత్రి శివరాజ్ చౌహాన్ లు శ్రీకారం చుట్టారని చెప్పారు. శాశ్వత హక్కులతో ఇచ్చిన స్థలాన్ని అమ్ముకోకుండా నివాసం ఉంటేనే ప్రభుత్వ లక్ష్యం నెరవేరినట్టన్నారు. దేశంలో ఎక్కడా లేని రీతిలో సంక్షేమాన్ని అందిస్తున్న కూటమి ప్రభుత్వాన్ని ఆశీర్వదించాలని కోరారు. ఈనెల 19 న సీఎం చేతుల మీదుగా పట్టాలు తీసుకోని 79 మంది లబ్ధిదారులకు తన చేతుల మీదుగా అందిస్తున్నానని తెలిపారు.

కార్యక్రమంలో ఆర్డీఓ సంగీత్ మాధుర్, ఎమ్మార్వో రామారావు, ఎంపీడీఓ నగేష్, కూటమి నాయకులు చిక్కాల విజయ్ బాబు, గాడు చిన్ని కుమారి లక్ష్మి, గంటా నూకరాజు, గొలగాని నరేంద్ర, గరే సదానంద, తమ్మిన సూరిబాబు, పాసి నరసింగరావు, జీరు సత్యం, కనకల అప్పలనాయుడు, దండి వెంకటేష్ తదితరులు పాల్గొన్నారు.

SHIVA, BHIMILI

SHIVA, BHIMILI