Anakapalle: అనకాపల్లి దసరా ఉత్సవాల్లో అగ్నిప్రమాదం పరుగులు తీసిన జనం!

Anakapalle: అనకాపల్లి దసరా ఉత్సవాల్లో విద్యుత్ అలంకరణలో షార్ట్ సర్క్యూట్ కారణంగా అగ్నిప్రమాదం సంభవించింది.

NAGA SRINIVASARAO,	ANAKAPALLI
Updated on: 21 Oct 2026 6:24 AM IST
Anakapalle
X

Anakapalle: అనకాపల్లి దసరా ఉత్సవాల్లో అగ్నిప్రమాదం.. పరుగులు తీసిన జనం

Anakapalle: అనకాపల్లి దసరా ఉత్సవాల్లో ఒక్కసారిగా చోటుచేసుకున్న అగ్నిప్రమాదం కలకలం రేపింది. దసరా వేడుకల కోసం ఏర్పాటు చేసిన విద్యుత్ అలంకరణలో షార్ట్ సర్క్యూట్ కారణంగా ఒక్కసారిగా మంటలు చెలరేగాయి. దీంతో ఉత్సవాలను తిలకించేందుకు భారీ సంఖ్యలో తరలివచ్చిన ప్రజలు తీవ్ర ఆందోళనకు గురయ్యారు.

విద్యుత్ అలంకరణ నుంచి మంటలు ఎగసిపడటంతో అక్కడున్న జనం భయాందోళనకు గురై పరుగులు తీశారు. ఉత్సవాల ప్రాంగణంలో కొద్దిసేపు గందరగోళ పరిస్థితి నెలకొంది.

సమాచారం అందుకున్న అగ్నిమాపక సిబ్బంది వెంటనే ఘటనా స్థలానికి చేరుకుని మంటలను అదుపులోకి తీసుకొచ్చారు. ఫైర్ సిబ్బంది సకాలంలో స్పందించడంతో ప్రమాదం మరింత తీవ్రరూపం దాల్చకుండా అడ్డుకట్ట పడింది.

ఈ ఘటనలో ఎలాంటి ప్రాణనష్టం జరగకపోవడంతో స్థానికులు, ఉత్సవాలకు వచ్చిన ప్రజలు ఊపిరి పీల్చుకున్నారు. పండుగ వేళ చోటుచేసుకున్న ఈ ఘటనతో విద్యుత్ అలంకరణల భద్రతపై ఆందోళన వ్యక్తమవుతోంది. అనకాపల్లి దసరా ఉత్సవాల్లో చోటుచేసుకున్న ఈ ఘటనతో అప్రమత్తమైన అధికారులు.. భద్రతా చర్యల ప్రాధాన్యతను మరోసారి గుర్తుచేశారు.

NAGA SRINIVASARAO,	ANAKAPALLI

NAGA SRINIVASARAO, ANAKAPALLI