Visakhapatnam: విశాఖ బీచ్‌లో మద్యం దుకాణాలా? ప్రభుత్వంపై మాజీ కార్పొరేటర్ ఫైర్!

Visakhapatnam: విశాఖ బీచ్‌లలో మద్యం అమ్మకాలపై మాజీ కార్పొరేటర్ కోడిగుడ్ల పూర్ణిమ శ్రీధర్ నిరసన.

GOPI, PENDURTHI
Published on: 6 Jun 2026 1:57 PM IST
Visakhapatnam
X

Visakhapatnam: విశాఖ బీచ్‌లో మద్యం దుకాణాలా? ప్రభుత్వంపై మాజీ కార్పొరేటర్ ఫైర్!

కంచరపాలెం: బీచ్ ఒడ్డున మద్యం అమ్మకాలు చేయాలని కూటమి ప్రభుత్వం తీసుకున్న నిర్ణయాన్ని వెనక్కి తీసుకోవాలని 41 వ వార్డు మాజీ కార్పొరేటర్ కోడిగుడ్ల పూర్ణిమ శ్రీధర్ అన్నారు. ఇప్పటికే రాష్ట్రంలో మద్యం సమయం సందర్భం లేకుండా ఏరులై పారుతుందన్నారు.

ఇప్పుడు విశాఖ సాంప్రదాయ సంస్కృతలను మంట కలుపుతూ బీచ్ ఒడ్డున మద్యం దుకాణాలు ఏర్పాటు చేస్తే మహిళలకు భద్రత ఎక్కడ ఉంటుందని ప్రశ్నించారు. ప్రశాంత నగరంలో సేదతీరేందుకు కుటుంబ సమేతంగా బీచ్ తీర ప్రాంతాలకి లక్షలాది మంది ప్రజలు వస్తుంటారు. అక్కడ కూడా మద్యం వ్యాపారకేంద్రాలుగా మార్చే ప్రయత్నం చేయడం అత్యంత ప్రమాదకరమైన చర్య అని మండిపడ్డారు.

గురువారం జరిగిన కేబినెట్ సమావేశంలో బీచ్ షాక్ పేరుతో బీచ్ ఒడ్డున మద్యం అమ్మకాలకు ప్రభుత్వం ఆమోదం తెలపడం, దీనిని ప్రాధాన్యత అంశంగా తీసుకోవడం చూస్తుంటే మహిళల భద్రత పట్ల ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు చిత్తశుద్ధి ఏమిటో ప్రజలకు స్పష్టంగా అర్థమవుతోందన్నారు. బహిరంగ ప్రదేశాల్లో మద్యం సేవించడం, అసభ్య ప్రవర్తన, వేధింపులు, రోడ్డు ప్రమాదాలు పెరిగే ప్రమాదం ఉందన్నారు.

ఎన్నికల సమయంలో మహిళా సంక్షేమం, మహిళా భద్రత, ఆడబిడ్డల రక్షణ గురించి గొప్పలు చెప్పిన చంద్రబాబు పవన్ కళ్యాణ్ ఇప్పుడు ఏం సమాధానం చెబుతారని ప్రశ్నించారు.

GOPI, PENDURTHI

GOPI, PENDURTHI

Next Story