Visakhapatnam: బాపూజీ నగర్‌లో గంకల కవిత మార్క్ పాలిటిక్స్.. ఎండలోనే వాటరింగ్!

Visakhapatnam: జీవీఎంసీ 48వ వార్డులో ‘గుడ్ మార్నింగ్ గంకల’ కార్యక్రమం.

GOPI, PENDURTHI
Published on: 15 May 2026 7:30 PM IST
Visakhapatnam
X

Visakhapatnam: బాపూజీ నగర్‌లో గంకల కవిత మార్క్ పాలిటిక్స్.. ఎండలోనే వాటరింగ్!

Visakhapatnam: ప్రజల సంక్షేమమే తమకు ముందని తరువాతే ఇంకేదైనా అని 48వ వార్డు మాజీ కార్పొరేటర్, జీవీఎంసీ మాజీ స్టాండింగ్ కమిటీ మెంబర్,జీవీఎంసీ మాజీ బీజేపీ ఫ్లోర్ లీడర్ గంకల కవితా అప్పారావు యాదవ్ స్పష్టం చేశారు.48వ వార్డులో గుడ్ మార్నింగ్ గంకల కార్యక్రమంలో ప్రజలకు ఇచ్చిన మాట ప్రకారం వార్డు అభివృద్ధి కోసం నిరంతరం కృషి చేయడం జరుగుతుందని గంకల కవితా అప్పారావు యాదవ్ స్పష్టం చేశారు.ఈ మేరకు శుక్రవారం నాడు వార్డులో గల బాపూజీ నగర్ లో ఉదయం నుంచి పర్యటన చేసి నిర్మాణ దశలో ఉన్న బాపూజీ నగర్ మినీ ఫంక్షన్ హల్ నిర్మాణ పనులను పరిశీలించారు.మండే ఎండను సైతం లెక్క చేయకుండా మినీ ఫంక్షన్ హాల్ పనులను పరిశీలించి వాటరింగ్ చేశారు.

ప్రతి రోజు బిల్డింగ్ కు వాటరింగ్ చేయాలనీ,వాటరింగ్ ఎంత ఎక్కువ ఉంటే నిర్మాణం అంత పటిష్టంగా ఉంటుందన్నారు.అనంతరం కాంట్రాక్టర్ తో మాట్లాడి ఫంక్షన్ హాల్ పనులను వేగవంతం చేయాలని, మినీ ఫంక్షన్ హాలు లేక వార్డు ప్రజలు ఇబ్బందులు పడుతున్నారని కాంట్రాక్టర్ కు సూచించారు.ఈ సందర్భంగా గంకల కవిత అప్పారావు యాదవ్ మాట్లాడుతూ అభివృద్ధి పనులతో వార్డులో కొత్త కళ సంతరించుకుందని,బాపూజీ నగర్ లో ఉదయం నుంచి సాయంత్రం వరకు పర్యటన చేసి పలు అభివృద్ధి పనులను పరిశీలించడం జరిగిందని,గుడ్ మార్నింగ్ గంకల కార్యక్రమంలో ప్రజలకు ఇచ్చిన మాట ప్రకారం వార్డు అభివృద్ధి కోసం నిరంతరం కృషి చేయడం జరుగుతుందన్నారు.

ప్రజల సంక్షేమమే తమకు ముందని తరువాతే ఇంకేదైనా అన్నారు.బాపూజీ నగర్ లో మినీ ఫంక్షన్ హాల్ లేకపోవడంతో ప్రజలు శుభకార్యాలకు లక్షల రూపాయలు ఖర్చుపెట్టి ప్రైవేట్ ఫంక్షన్ హాల్స్ లో శుభకార్యాలు చేసుకోవడం ఇబ్బందిగా మారిందని వచ్చిన ఫిర్యాదు మేరకు మినీ ఫంక్షన్ హాల్ నిర్మాణం చేపట్టడం జరుగుతుందని ఈ నిర్మాణం పూర్తి అయితే పేద ప్రజల ఇంట్లో శుభకార్యాలు ఈ మినీ ఫంక్షన్ హాల్ లో చేసుకోవచ్చన్నారు.తమకు పదవులు ముఖ్యం కాదని,ప్రజలే ముఖ్యమన్నారు.వార్డు అభివృద్ధి కోసం నిరంతరం శ్రమించడం జరుగుతుందని వార్డు ప్రజలకు ఎటువంటి సమస్య ఏర్పడిన తక్షణమే తనను సంప్రదించాలని గంకల పేర్కొన్నారు.బాపూజీ నగర్ సమస్యలపై పర్యటించి, జీవీఎంసీ కౌన్సిల్లో చర్చించి అభివృద్ధి పనులు చేపడుతున్న గంకల కవితా అప్పారావు యాదవ్ కు బాపూజీ నగర్ ప్రజల అభినందనలు తెలిపారు.

GOPI, PENDURTHI

GOPI, PENDURTHI

Next Story