Anakapalle: జీవీఎంసీ 107వ వార్డులో మాజీ మంత్రి కొణతాల రామకృష్ణ విస్తృత ప్రచారం!
Anakapalle: జీవీఎంసీ 107వ వార్డు పరిధిలోని అనకాపల్లి గవరపాలెంలో ఎన్డీయే కూటమి కార్పొరేటర్ అభ్యర్థి చిన్నతల్లి నీలబాబుతో కలిసి మాజీ మంత్రి కొణతాల రామకృష్ణ విస్తృత ఇంటింటి ప్రచారం చేపట్టారు.
Anakapalle: జీవీఎంసీ 107వ వార్డులో మాజీ మంత్రి కొణతాల రామకృష్ణ విస్తృత ప్రచారం!
Anakapalle: జీవీఎంసీ స్థానిక ఎన్నికల నేపథ్యంలో అనకాపల్లి ఎమ్మెల్యే, మాజీ మంత్రి కొణతాల రామకృష్ణ 107వ వార్డులో విస్తృతంగా ఎన్నికల ప్రచారం నిర్వహించారు. గవరపాలెంలోని అంబేద్కర్ నగర్, బోయిగూడెం ప్రాంతాల్లో కూటమి కార్పొరేటర్ అభ్యర్థి మదంశెట్టి చిన్నతల్లి నీలబాబుతో కలిసి ఇంటింటికీ వెళ్లి ప్రజలను కలుసుకున్నారు.
ఈ సందర్భంగా కూటమి అభ్యర్థులకు ప్రజలు మద్దతు తెలిపి, అత్యధిక మెజారిటీతో గెలిపించాలని కొణతాల రామకృష్ణ విజ్ఞప్తి చేశారు. స్థానిక ఎన్నికల్లో కూటమి అభ్యర్థుల విజయానికి ప్రతి ఒక్కరూ సహకరించాలని కోరారు.
107వ వార్డులోని పలు ప్రాంతాల్లో పర్యటించిన నాయకులు, ప్రజలతో మమేకమై ఎన్నికల ప్రచారాన్ని కొనసాగించారు. ఈ కార్యక్రమంలో 107వ వార్డు జనసేన పార్టీ ఇన్‌చార్జి చేబోలు దుర్గా ప్రసాద్‌తో పాటు కూటమి నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.




