Pendurthi: పెందుర్తిలో ఉచిత కంటి వైద్య శిబిరం: మోదీ జన్మదిన వేడుకలు!

Pendurthi: మోదీ సేవా స్ఫూర్తితో పెందుర్తిలో ఉచిత కంటి వైద్య శిబిరం 25 ఏళ్ల ప్రజాప్రస్థానం సందర్భంగా బీజేపీ ఆధ్వర్యంలో నిర్వహణ హాజరైన ఎన్డీయే కూటమి నాయకులు.

GOPI, PENDURTHI
Published on: 3 Oct 2026 10:13 PM IST
Pendurthi
X

Pendurthi: పెందుర్తిలో ఉచిత కంటి వైద్య శిబిరం: మోదీ జన్మదిన వేడుకలు!

పెందుర్తి: ప్రధాని నరేంద్ర మోదీ జన్మదిన వేడుకలను పురస్కరించుకుని, ప్రజాక్షేత్రంలో మోదీ 25 సంవత్సరాల ప్రస్థానాన్ని గుర్తు చేసుకుంటూ భారతీయ జనతా పార్టీ నాయకులు గంకల రాజు ఆధ్వర్యంలో ఉచిత కంటి వైద్య శిబిరాన్ని నిర్వహించారు. పెందుర్తిలో నిర్వహించిన ఈ శిబిరానికి బీజేపీ రాష్ట్ర కార్యదర్శి కేతినేని సురేంద్ర మోహన్ ముఖ్య అతిథిగా హాజరయ్యారు.

ఈ సందర్భంగా గంకల రాజు మాట్లాడుతూ.. ప్రధాని నరేంద్ర మోదీ ఆశయాలు, సేవా స్ఫూర్తిని ప్రజల్లోకి తీసుకెళ్లే విధంగా మరిన్ని సేవా కార్యక్రమాలు నిర్వహిస్తామని తెలిపారు. పెందుర్తిలో కూటమి నాయకులతో సమన్వయంతో పనిచేస్తూ భారతీయ జనతా పార్టీని మరింత బలోపేతం చేసేందుకు కృషి చేస్తామని పేర్కొన్నారు. మోదీ ఆశయాలను ముందుకు తీసుకెళ్లడమే తమ లక్ష్యమని అన్నారు. ఉచిత కంటి వైద్య శిబిరంలో ప్రజలకు కంటి పరీక్షలు నిర్వహించి అవసరమైన వైద్య సలహాలు అందించారు. సేవా కార్యక్రమాన్ని స్థానికులు అభినందించారు.

ఈ కార్యక్రమంలో టీడీపీ యువ నాయకులు గండి వంశీ, గొంప సత్యనారాయణ, జనసేన పార్టీ నాయకులు సుధాకర్ రాజు, బీజేపీ పెందుర్తి నియోజకవర్గం మాజీ కార్పొరేటర్ ముమ్మన దేముడు, బీజేపీ పెందుర్తి నియోజకవర్గ ఇన్‌చార్జ్ గొర్లె రామునాయుడు, ఆంధ్రప్రదేశ్ మార్కెటింగ్ కమిటీ చైర్మన్ ఆవగడ్డ అప్పలనాయుడు, బీజేపీ నాయకులు శ్రీకాంత్, గురునాథ్ తదితరులు పాల్గొన్నారు.

GOPI, PENDURTHI

GOPI, PENDURTHI