Golugonda: నిమ్మగడ్డలో ఉచిత వైద్య శిబిరం: డాక్టర్ శ్యామ్ కుమార్
Golugonda: అనకాపల్లి జిల్లా గొలుగొండ మండలం నిమ్మగడ్డ గ్రామంలో వైద్యాధికారి డాక్టర్ శ్యామ్ కుమార్ ఆధ్వర్యంలో ఉచిత వైద్య శిబిరం నిర్వహించి పరీక్షలు చేశారు.
Golugonda: నిమ్మగడ్డలో ఉచిత వైద్య శిబిరం: డాక్టర్ శ్యామ్ కుమార్
అనకాపల్లి జిల్లా: గొలుగొండ మండలం పాత మల్లంపేట పంచాయతీ పరిధిలోని నిమ్మగడ్డ గ్రామంలో వైద్య శిబిరం నిర్వహించారు. గొలుగొండ వైద్యాధికారి డాక్టర్ శ్యామ్ కుమార్ ఆధ్వర్యంలో వైద్య సిబ్బంది శిబిరం ఏర్పాటు చేసి గ్రామ ప్రజలకు వైద్య పరీక్షలు నిర్వహించారు.
ఈ సందర్భంగా డాక్టర్ శ్యామ్ కుమార్ మాట్లాడుతూ ప్రజలందరూ ఆరోగ్యంగా ఉండేందుకు పరిసరాలను పరిశుభ్రంగా ఉంచుకోవాలని సూచించారు.
ముఖ్యంగా వేడి నీటిని మాత్రమే తాగాలని, ఆరోగ్యంపై నిర్లక్ష్యం చేయకుండా అవసరమైనప్పుడు వైద్యులను సంప్రదించాలని ఆయన సూచించారు.




