Kasimkota: రాష్ట్రంలోనే మొదటి స్థానంలో జీ. భీమవరం పంచాయతీ!
Kasimkota: అనకాపల్లి జిల్లా జీ. భీమవరం పంచాయతీకి రాష్ట్రంలోనే ప్రథమ స్థానం. ఐఎస్‌ఓ సర్టిఫికెట్ అందజేత, త్వరలో కేంద్రం నుంచి రూ.కోటి నిధుల రాక.
Kasimkota: రాష్ట్రంలోనే మొదటి స్థానంలో జీ. భీమవరం పంచాయతీ!
Kasimkota: అనకాపల్లి నియోజకవర్గాన్ని అభివృద్ధి పథంలో ముందుకు తీసుకెళ్తున్న అనకాపల్లి ఎమ్మెల్యే, మాజీ మంత్రి కొణతాల రామకృష్ణ నేతృత్వంలో కసింకోట మండలం జీ. భీమవరం గ్రామపంచాయతీ రాష్ట్రంలోనే ప్రథమ స్థానాన్ని సాధించి మోడల్ గ్రామంగా గుర్తింపు పొందింది.
రాష్ట్రంలో ఎంపిక చేసిన మూడు పంచాయతీల్లో జీ. భీమవరం పంచాయతీ మొదటి స్థానంలో నిలిచిన సందర్భంగా పంచాయతీకి ISO సర్టిఫికెట్‌ను ప్రదానం చేశారు. పంచాయతీరాజ్ శాఖ మంత్రి కొణిదెల పవన్ కళ్యాణ్ తరఫున పంచాయతీరాజ్ శాఖ కార్యదర్శి కృష్ణ తేజ చేతుల మీదుగా గ్రామ సెక్రటరీ నారాయణరావుకు ఈ సర్టిఫికెట్ అందజేశారు.
గ్రామంలో మంచినీటి సరఫరా, రహదారులు, కాలువల అభివృద్ధితో పాటు ప్రతి ఇంటికీ ప్రభుత్వ సంక్షేమ పథకాలు అందేలా చర్యలు చేపట్టడం వల్ల జీ. భీమవరం అభివృద్ధి సాధించిందని పేర్కొన్నారు. ఎమ్మెల్యే కొణతాల రామకృష్ణ నేతృత్వంలో గ్రామాభివృద్ధికి ప్రత్యేకంగా కృషి చేసినట్లు తెలిపారు.
జీ. భీమవరం పంచాయతీ సాధించిన ఈ గుర్తింపుతో త్వరలో కేంద్ర ప్రభుత్వం నుంచి గ్రామానికి రూ.కోటి నిధులు అందనున్నాయని తెలిపారు. ఈ నిధులతో గ్రామంలో మరిన్ని అభివృద్ధి కార్యక్రమాలు చేపట్టే అవకాశం ఉందన్నారు.
రాష్ట్రంలోనే తమ గ్రామానికి ప్రథమ స్థానం లభించడంపై గ్రామ ప్రజలు హర్షం వ్యక్తం చేశారు. గ్రామాభివృద్ధికి కృషి చేసిన ఎమ్మెల్యే కొణతాల రామకృష్ణకు గ్రామస్థులు ప్రత్యేక కృతజ్ఞతలు తెలిపారు.




