Vadlapudi: వడ్లపూడిలో 100 పడకల పవన్ సాయి ఆసుపత్రి ప్రారంభం

Vadlapudi: వడ్లపూడిలో పతివాడ రామారావు నిర్మించిన 100 పడకల పవన్ సాయి ఆసుపత్రి ప్రారంభం; బీజేపీ నేత కరణంరెడ్డి నరసింగరావు ముఖ్య అతిథిగా హాజరు.

PRAKASH, GAJUWAKA
Published on: 27 Nov 2026 11:24 PM IST
Vadlapudi
X

Vadlapudi: వడ్లపూడిలో 100 పడకల పవన్ సాయి ఆసుపత్రి ప్రారంభం

వడ్లపూడి: వడ్లపూడిలో పతివాడ రామారావు నూతన పవన్ సాయి 100 పడకల సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్ నిర్మించారు. శుక్రవారం ఉదయం శ్రీ సత్యన్నారాయణ స్వామి వారి పూజ చేసి ఘనంగా ప్రారంభించారు. ఆంజనేయస్వామి వారి ఆలయం పూజలు చేసి ప్రారంభించారు. గౌరవ అతిథిగా బిజేపి గాజువాక ఇంచార్జ్ మరియు రాష్ట్ర మీడియా పేనలిస్ట్ కరణంరెడ్డి నరసింగరావు పాల్గొన్నారు. రామారావుని సాలువాతో సత్కరించి అభినందనలు తెలిపారు.

ఈ సందర్భంగా కేఎన్ఆర్ మాట్లాడుతూ పతివాడ రామారావు ఒక మధ్యతరగతి కుటుంబంలో జన్మించి, అంచెలంచెలుగా ఎదుగుతూ , చిన్న భవనం అద్దెకు తీసుకొని ఆసుపత్రి నడుపుతూ తన ప్రస్థానం ప్రారంభించారని అన్నారు. నేడు 100 పడకల సొంత భవనం నిర్మాణం పూర్తి చేసి ప్రారంభోత్సవం చేయడం సంతోషంగా ఉందన్నారు. పేదలకు , మధ్యతరగతి ప్రజలకు, ఉన్నత వర్గాలకు అన్ని రకాల వైద్య సదుపాయాలను కల్పించే విధంగా ఆసుపత్రి నిర్మాణం అత్యంత నాన్యమైన, అధునాతనమైన వైధ్య పరికరాలను అందుబాటులోకి తీసుకు వచ్చారని అన్నారు.

గత పది సంవత్సరాలుగా ఎంతో మంది నిరుపేదలకు అతి తక్కువ ఖర్చుతో మంచి వైద్యం అందిస్తూ, సమాజంలో మంచి పేరు ప్రతిష్టలు సంపాదించారని అన్నారు. రామారావు నేటి యువతకు ఆదర్శంగా నిలిచారని కొనియాడారు. రామారావు కేఎన్ఆర్ కి సాలువాతో సత్కరించి ధన్యవాదాలు తెలిపారు. కార్యక్రమంలో కార్పొరేటర్లు, బిజేపి జిల్లా కార్యదర్శి సోంబాబు ,వార్డు అధ్యక్షులు కరణం వెంకటరావు ,కనకరాజు ,ఈశ్వరరావు,కృష్ణారెడ్డి , నాగబాబుశర్మ తదితరులు పాల్గొన్నారు.

PRAKASH, GAJUWAKA

PRAKASH, GAJUWAKA