Gajuwaka: 88వ వార్డు బిజేపి అభ్యర్థి నూకరాజు ప్రచారంలో అరవింద్ సింగ్!

Gajuwaka: గాజువాక 88వ వార్డు బిజేపి అభ్యర్థి సిరసపల్లి నూకరాజు ప్రచారంలో ఏపీ బిజేపి ఇన్‌ఛార్జ్ అరవింద్ సింగ్ బధోరియా. ఇంటింటికీ వెళ్లి కరపత్రాల పంపిణీ.

PRAKASH, GAJUWAKA
Published on: 24 Oct 2026 10:09 PM IST
Gajuwaka
X

Gajuwaka: 88వ వార్డు బిజేపి అభ్యర్థి నూకరాజు ప్రచారంలో అరవింద్ సింగ్!

గాజువాక: ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర బిజేపి ఇంచార్జ్ మరియు యంపి అరవింద్ సింగ్ బధోరియా గాజువాక 88వ వార్డులో కూటమి బలపరిచిన బిజేపి సిరసపల్లి నూకరాజు ఎన్నికల ప్రచారంలో పాల్గొన్నారు.

నియోజకవర్గం కన్వీనర్ కరణంరెడ్డి నరసింగరావు అధ్యక్షతన ఇంటింటికి వెళ్లి కరపత్రాలు పంపిణీ చేసి ఓటర్లను ఆకట్టుకున్నారు. అడుగడుగునా మహిళలు మంగళ హారతులు ఇచ్చి ఆశీర్వదించారు.

కార్యక్రమంలో రాష్ట్ర కార్యదర్శి ఉత్తరాంధ్ర ఎన్నికల ఇంచార్జి సురేంద్ర మోహన్, మాజీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి కాశీరాజు,టిడిపి నాయకులు ప్రజ్ఞప్రియ,మురళి,వరహాలరావు,నాగేశ్వరరావు బారీగ మహిళలు కూటమి కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు.

PRAKASH, GAJUWAKA

PRAKASH, GAJUWAKA