Gajuwaka: గాజువాకలో కూటమి నేతల ఆత్మీయ సమావేశం!
Gajuwaka: గాజువాకలో టీడీపీ-జనసేన-బీజేపీ ఆత్మీయ సమావేశం. కూటమి విజయం కోసం ప్రతీ ఒక్కరూ సమిష్టిగా కృషి చేయాలని పిలుపునిచ్చిన ఎమ్మెల్యే పల్లా శ్రీనివాసరావు.
Gajuwaka: గాజువాకలో కూటమి నేతల ఆత్మీయ సమావేశం!
Gajuwaka: గాజువాక గ్రీన్ సిటీ లో టిడిపి జనసేన బిజెపి నాయకులు మాజీ కార్పొరేటర్లు కూటం సమావేశంలో పాల్గొన్నారు. కూటమి సమావేశంలో ఎమ్మెల్యే పల్లా శ్రీనివాసరావు మాట్లాడుతూ 100% స్ట్రైక్ రైట్ తో ఉన్న పార్టీ కూటమి పార్టీ అని పార్టీలలో ఆశావాదులందరూ వారి సమిష్టిగా కూటమి ప్రభుత్వం గెలుపు దిశగా పనిచేయాలని స్వలాభం కోసం ఆర్థిక ఎదుగుదల కోసం రాజకీయాల్లో ఉండడం సరికాదని కేవలం ప్రజా శ్రేయ శబరిష్యగా ముందుకు రావాలని కోరారు.
కూటమి కుటుంబంలో మహిళలకు యువతకు ప్రాధాన్యత కల్పిస్తామని రాబోయే ఎన్నికల్లో ఎవరికి సీట్లు కేటాయించిన మిగిలిన వారు మనస్పర్ధలకు ప్రలోభాలకు అసూయలకు పోకుండా కూటమి ఎవరికి సీట్లు కేటాయిస్తుందో వారిని గెలిపించాలని తెలిపారు.
ఒకసారి ప్రభుత్వం లోకి వచ్చినందుకే వైసిపి మన రాష్ట్రాన్ని పదేళ్లు వెనక్కి నెట్టిందని ఈసారి ఎట్టి పరిస్థితుల్లో వైసిపికి స్థానం కల్పించకూడదనే దిశగా ప్రణాళిక సిద్ధం చేస్తున్నామన్నారు.




