Gajuwaka: తోటి పోలీస్ కుటుంబానికి గాజువాక పోలీసుల రూ.53 వేల సాయం
Gajuwaka: విశాఖ టూ టౌన్ ట్రాఫిక్ సిబ్బంది బిడ్డ చికిత్స కోసం గాజువాక లా అండ్ ఆర్డర్, క్రైమ్ పోలీసులు రూ.53 వేల ఆర్థిక సహాయం; సీఐ వాసు నాయుడు చేతుల మీదుగా అందజేత.
Gajuwaka: తోటి పోలీస్ కుటుంబానికి గాజువాక పోలీసుల రూ.53 వేల సాయం
గాజువాక: విశాఖపట్నం సిటీ టూ టౌన్ ట్రాఫిక్ పోలీస్ స్టేషన్లో విధులు నిర్వహిస్తున్న 2009 బ్యాచ్ WHC-1913 శ్రీమతి సుస్సన్న గారి బిడ్డ ప్రీమెచ్యూర్గా జన్మించడంతో, ప్రస్తుతం మెడికవర్ ఆసుపత్రిలో వైద్య చికిత్స పొందుతోంది. చిన్నారి వైద్య చికిత్సకు సుమారు రూ.18 లక్షల వరకు ఖర్చు అవుతుందని వైద్యులు తెలియజేయడంతో, ఆ కుటుంబం ఎదుర్కొంటున్న ఆర్థిక ఇబ్బందులను గుర్తించిన గాజువాక పోలీస్ సిబ్బంది మానవతా దృక్పథంతో స్పందించారు.
ఈ క్రమంలో గాజువాక లా అండ్ ఆర్డర్ సిబ్బంది రూ.43,000/- మరియు గాజువాక క్రైమ్ సిబ్బంది రూ.10,000/- కలిపి మొత్తం రూ.53,000/- ఆర్థిక సహాయాన్ని గాజువాక పోలీస్ స్టేషన్ సీఐ శ్రీ. వాసు నాయుడు గారి చేతుల మీదుగా అందజేశారు.
తోటి సిబ్బందికి కష్టం వచ్చినప్పుడు మేమున్నామంటూ ముందుకు రావడం పోలీస్ కుటుంబంలోని ఐక్యతకు, మానవత్వానికి నిదర్శనం. విధి నిర్వహణలోనే కాకుండా, తోటి సిబ్బంది కుటుంబాల కష్టసుఖాల్లోనూ అండగా నిలుస్తామని గాజువాక పోలీసులు తమ సేవాభావాన్ని చాటుకున్నారు. చిన్నారి త్వరగా కోలుకొని సంపూర్ణ ఆరోగ్యంతో ఇంటికి చేరుకోవాలని గాజువాక పోలీస్ సిబ్బంది ఆకాంక్షించారు.




