Gajuwaka: తప్పిపోయిన వృద్ధుడిని కుటుంబానికి అప్పగించిన పోలీసులు!

Gajuwaka: గాజువాకలో తప్పిపోయిన 80 ఏళ్ల వృద్ధుడిని బ్లూకోల్ట్స్ కానిస్టేబుల్ కళ్యాణ్ సమయస్ఫూర్తితో గుర్తించి క్షేమంగా కుటుంబ సభ్యులకు అప్పగించారు. స్థానికుల ప్రశంసలు.

PRAKASH, GAJUWAKA
Published on: 10 Nov 2026 8:28 PM IST
Gajuwaka
X

Gajuwaka: తప్పిపోయిన వృద్ధుడిని కుటుంబానికి అప్పగించిన పోలీసులు!

గాజువాక: గాజువాక పోలీస్ స్టేషన్ పరిధిలోని జింక్ సీఎస్ఎఫ్ మైదానంలో స్థానిక యువకులు క్రికెట్ ఆడుతుండగా, సుమారు 70–80 సంవత్సరాల వయస్సు కలిగిన ఒక వృద్ధుడు నడవలేని స్థితిలో, నీరసంగా ఉండటాన్ని గమనించి పోలీసులకు సమాచారం అందించారు.

వెంటనే సీఐ గారి ఆదేశాల మేరకు బ్లూకోట్ కానిస్టేబుల్ కళ్యాణ్ సంఘటనా స్థలానికి చేరుకుని, వృద్ధుడికి సహాయం అందిస్తూ అతని పేరు, చిరునామా తదితర వివరాలను తెలుసుకునేందుకు ప్రయత్నించారు. అయితే వృద్ధుడు తన వివరాలను తెలియజేయలేని పరిస్థితిలో ఉండటంతో, అతని ఫోటోను తీసి సోషల్ మీడియా ద్వారా ప్రచారం చేసి కుటుంబ సభ్యుల ఆచూకీ తెలుసుకునేందుకు ప్రత్యేక చొరవ చూపించారు.

ఈ క్రమంలో వృద్ధుడి పేరు కోటిపల్లి నూకయ్య, తండ్రి రాముడు అని, తన కుమారుడు రమేష్ వద్ద బోనోజి తోట, రోడ్ నంబర్ 10లో నివసిస్తున్నట్లు గుర్తించారు. రెండు రోజుల క్రితం ఇంటి నుంచి బయటకు వెళ్లి తిరిగి రాకపోవడంతో కుటుంబ సభ్యులు ఆందోళన చెందుతున్నట్లు తెలిసింది. వెంటనే అతని కుమారుడు రమేష్‌ను సంప్రదించి, వృద్ధుడిని క్షేమంగా కుటుంబ సభ్యులకు అప్పగించారు.

ఈ సందర్భంగా బ్లూకోట్ కానిస్టేబుల్ కళ్యాణ్ చూపిన మానవతా దృక్పథం, విధి నిర్వహణలో బాధ్యత, సమయస్ఫూర్తి మరియు ప్రత్యేక చొరవ అభినందనీయం. తప్పిపోయిన వృద్ధుడిని గుర్తించి తిరిగి కుటుంబ సభ్యుల చెంతకు చేర్చడంలో కళ్యాణ్ చేసిన కృషిని గాజువాక పోలీసులు అభినందించారు.

PRAKASH, GAJUWAKA

PRAKASH, GAJUWAKA