Gajuwaka: వైసీపీలోని దుష్టశక్తుల వల్లే సీటు రాలేదు సిరట్ల శ్రీనివాస్!
Gajuwaka: గాజువాక 97వ వార్డులో వైసీపీ రెబెల్ అభ్యర్థిగా సిరట్ల శ్రీనివాస్ (వాసు) ఇండిపెండెంట్ పోటీ. పార్టీ దుష్టశక్తులపై విలేకరుల సమావేశంలో ఫైర్.
Gajuwaka: వైసీపీలోని దుష్టశక్తుల వల్లే సీటు రాలేదు సిరట్ల శ్రీనివాస్!
గాజువాక: వైసీపీ పార్టీ లోని కొన్ని దుష్టశక్తుల వలన తనకు ఈ ఎన్నికలలో టికెట్ రాలేదని 97వ వార్డులో ఇండిపెండెంట్ అభ్యర్థిగా పోటీ చేస్తున్న సిరట్ల శ్రీనివాస్ (వాసు)అసహనం వ్యతం చేశారు. పార్టీలో తనకు జరిగిన అన్యాయాన్ని అలాగే తాను ఇండిపెండెంట్ అభ్యర్థిగా పోటీ చేసేందుకు గల కారణాలను తెలియచేసేందుకు ఆయన కార్యాలయంలో పాత్రికేయులు సమావేశం నిర్వహించారు.
సోమవారం జరిగిన ఈ సమావేశంలో ఆయన మాట్లాడుతూ గతంలో తాను వైసిపి పార్టీలోనే ఉన్న ఉరుకుటి చెందు, ఎమ్మెల్యేగా పోటీ చేస్తున్న గుడివాడ అమర్నాధులకు సపోర్ట్ గా ఉండటంతోనే స్థానికంగా ఉన్న వైసిపి నాయకులు తనపై కక్షగట్టి టికెట్ రాకుండా చేశారని ఆరోపించారు. గత కార్పొరేషన్లలో అతి తక్కువ శాతంతో వైసిపి తరఫున పోటీ చేసి ఓడిపోయానని గుర్తు చేసారు.
పార్టీ ఆవిర్భావం నుంచి నేను పార్టీ అభివృద్ధి కోసం పని చేశానని ఆ సమయానికి మాజీ ఎమ్మెల్యే తిప్పల నాగిరెడ్డి కూడా పార్టీలోకి రాలేదని, అంత సీనియార్టీ ఉన్న తనకు సీటు ఇవ్వకుండా, జనసేన నుంచి పార్టీ లో జాయిన్ అయ్యిన వ్యక్తికి టికెట్ ఇచ్చి అవమాన పరిచారని ఆవేదన వ్యక్తం చేసారు. ఇండిపెండెంట్ అభ్యర్థి గా 97 వార్డులో తన విజయం ఎవ్వరు ఆపలేరని ధీమా వ్యక్తం చేసారు.
వార్డు పరిధిలో గత 15 సంవత్సరాలుగా అనేక సంక్షేమ అభివృద్ధి కార్యక్రమాలు నిర్వహించానని గుర్తు చేశారు. కొన్ని గ్రామాలకు కనెక్టివిటీ రహదారులు కూడా నిర్మించిన సంగతి అలాగే వార్డు అభివృద్ధి కోసం తాను చేసిన కార్యక్రమాలు కూడా ప్రజలందరికీ తెలుసు అన్నారు.
ముఖ్యంగా స్థానిక వైసీపీ నాయకుల వలన పార్టీ ఓడిపోతుందని ఆవేదన వ్యక్తం చేశారు. తాను ఇంకా పార్టీలోనే కొనసాగుతూ ఇండిపెండెంట్గా పోటీ చేస్తున్నానని పార్టీ నన్ను సస్పెండ్ చేయడం గాని నేను రిజైన్ చేయడం గాని చేయలేదన్నారు. వార్డు ప్రజలందరూ కత్తిరిగుత్తిపై ఓటు వేసి అత్యధిక మెజారిటీతో తనను గెలిపించాలని పాత్రికేయులు సమావేశం ద్వారా వార్డు ప్రజలను కోరారు.




