Gajuwaka: రాజ్యాంగ విలువలను పరిరక్షించే బాధ్యత ప్రతి ఒక్కరిపై ఉంది: కనకరాజు!
Gajuwaka: 77వ భారత రాజ్యాంగ దినోత్సవం సందర్భంగా 101వ వార్డు సిద్ధార్థ నగర్లోని డాక్టర్ బి.ఆర్. అంబేద్కర్ విగ్రహానికి కార్పొరేటర్ మాడిశ కనకరాజు పూలమాలవేసి ఘన నివాళులర్పించారు.
Gajuwaka: రాజ్యాంగ విలువలను పరిరక్షించే బాధ్యత ప్రతి ఒక్కరిపై ఉంది: కనకరాజు!
గాజువాక: 77వ భారత రాజ్యాంగ దినోత్సవం సందర్భంగా 101వ వార్డు సిదార్థ నగర్ లో గల డా. బి.ఆర్. అంబేద్కర్ విగ్రహానికి వార్డు కార్పొరేటర్ మాడిశ కనకరాజు పూలమాలవేసి ఘన నివాళి అర్పించారు.పూలే అంబేద్కర్ సంఘం ఆధ్వర్యంలో రాజ్యాంగ దినోత్సవం సందర్బంగా జరిగిన కార్యక్రమానికి ముఖ్య అతిధిగా స్థానిక వార్డు కార్పొరేటర్ మాడిశ కనకరాజు హాజరైయ్యారు.
ఈ సందర్బంగా కార్పొరేటర్ కనకరాజు మాట్లాడుతూ...
రాజ్యాంగ విలువలు పరిరక్షణ మన అందరి బాధ్యత అని అన్నారు, భారత రాజ్యాంగ నిర్మాత, దేశానికి దశా-దిశ చూపిన మహానుభావుడు, బడుగు-బలహీన, అణగారిన వర్గాల ఆశాజ్యోతి డా. బి.ఆర్. అంబేద్కర్ అని కొనియాడారు.. రాజ్యాంగం ద్వారా అణగారిన వర్గాలకు దిశా-దశ చూపి, సమాజంలో గుర్తింపు, గౌరవం, విలువలు కాపాడారని తెలిపారు. పార్లమెంటు నుంచి గ్రామ సర్పంచ్ వరకు అందరూ రాజ్యాంగాన్ని గౌరవంతో పాటిస్తున్నారని అన్నారు. నేటి యువత అంబేద్కర్ గారి జీవితాన్ని స్ఫూర్తిగా తీసుకోని ముందుకు వెళ్లాలని సూచించారు..
కార్యక్రమంలో సంఘం అధ్యక్షులు బాల్ భాస్కర్, ప్రతినిధులు కాశి జాన్ రమేష్, గాజువాక నియోజకవర్గ ఎస్సీ సెల్ ప్రధాన కార్యదర్శి, దాల్లయ్య , లోవరాజు, బసవరాజు, రామారావు, లింగయ్య , లాయర్ జనార్ధన్, పాల్ రీచ్డ్ సన్, సుందర మూర్తి, ఆదినారాయణ,స్థానిక వార్డు మహిళలు, తదితరులు పాల్గొన్నారు.




