Gajuwaka: వైసీపీలో జోష్.. ఇన్‌చార్జ్ దేవన్ ని కలిసిన బీసీ సెల్ నేత!

Gajuwaka: వైఎస్ఆర్సీపీ బీసీ సెల్ ప్రధాన కార్యదర్శిగా నూతనంగా నియమితులైన దామోదర్ రావు.. గాజువాక ఇన్‌చార్జ్ శ్రీనివాస రెడ్డిని కలిసి కృతజ్ఞతలు తెలిపారు.

GOPI, PENDURTHI
Published on: 14 Jun 2026 3:17 PM IST
Gajuwaka
X

Gajuwaka: వైసీపీలో జోష్.. ఇన్‌చార్జ్ దేవన్ ని కలిసిన బీసీ సెల్ నేత!

Gajuwaka: జీవీఎంసీ 87 సీనియర్ నాయకులైనటువంటి ముద్దపు దామోదర్ రావు జిల్లా వైసిపి బీసీ సెల్ ప్రధాన కార్యదర్శిగా నూతనంగా నియమితులైన సందర్భంగా 87 వార్డు వైఎస్ఆర్సిపి సీనియర్ నాయకులు ఆధ్వర్యంలో గాజువాక వైఎస్ఆర్సిపి ఇన్చార్జి తిప్పల శ్రీనివాస దేవన్ రెడ్డి మర్యాదపూర్వకంగా కలిసి శాలువాతో సత్కరించి కృతజ్ఞతల తెలియజేశారు.

అలాగే గాజువాక ఇన్చార్జి మాట్లాడుతూ సీనియర్ నాయకులు కు త్వరలోనే కొంతమందికి మరిన్ని పదవులు రానున్నాయని అలాగే వార్డు లో పార్టీని బోలోపేతను చేసి రానున్న కార్పొరేషన్ ఎలక్షన్లో వైఎస్ఆర్సిపి జెండా ఎగరవేయాలని వారు అన్నారు అలాగే వార్డు లో సీనియర్ నాయకులకు వివిధ పదవులు కాక మరి కొంతమందికి మరిన్ని పదవులు వస్తాయి కాబట్టి వారు రానున్న రోజుల్లో మరిన్ని పదవులు అధిరోహించాలని కోరుకుంటున్నామని అని అన్నారు.

అలాగే మన మాజీ ముఖ్యమంత్రివర్యులు జగన్మోహన్ రెడ్డి నమ్మకానికి మారుపేరని వైయస్సార్ కాంగ్రెస్ పార్టీకి కష్టకాలంలో నిలిచిన వ్యక్తులను మర్చిపోకుండా గుర్తించి వారికి ఉన్న స్థానంలో నిలబడతారని మరిన్ని పదవులు ఇచ్చే వ్యక్తి మాజీ ముఖ్యమంత్రివర్యులు జగన్మోహన్ రెడ్డి గారిని ఆయన్ని కొనియాడారు. అలాగే కొత్తగా నియమితులైన దానప్పలు మాట్లాడుతూ నన్ను గుర్తించి ఈ పదవిని వచ్చినందుకు ప్రత్యేక ధన్యవాదాలు తెలుపుతూ,

నా మీద ఉన్న నమ్మకాన్ని అమ్ము చేయకుండా పార్టీకి కష్టపడి పని చేస్తాను అని సందర్భంగా ఆయన అన్నారు ఈ కార్యక్రమంలో పాల్గొన్న వారు ,87 వా వార్డ్ అధ్యక్షులు బొడ్డ గోవిందా, ప్రగడ శ్రీనివాస్, చిత్రాడ వెంకటరమణ,దుగ్గపు దానప్పలు , బొడ్డ సన్యాసిరావు, గాలి ఆనంద్, ప్రగడ శంకర్రావు, పిన్నింటి సంతోష్,కె.వి నారాయణ,గున్న రామారావు, పూడి ఆనంద్ ,ముద్దపు మురళీమోహన్, ఆడారి శ్రీను సబ్బవరపు ఈశ్వరరావు , దామోదర్, తదితరులు పాల్గొన్నారు.

GOPI, PENDURTHI

GOPI, PENDURTHI

Next Story