Visakhapatnam: అల్లూరి పోరాటం నేటి తరానికి స్ఫూర్తిదాయకం: గంట్ల!

Visakhapatnam: సీతారామరాజు 129వ జయంతి సందర్భంగా విశాఖపట్నంలో ఏపీ వర్కింగ్ జర్నలిస్ట్స్ ఫెడరేషన్ రాష్ట్ర కార్యదర్శి గంట్ల శ్రీనుబాబు ఆయనకు ఘన నివాళులర్పించారు.

GOPI, PENDURTHI
Published on: 4 July 2026 12:22 PM IST
Visakhapatnam
X

Visakhapatnam: అల్లూరి పోరాటం నేటి తరానికి స్ఫూర్తిదాయకం: గంట్ల!

విశాఖపట్నం: గిరిజనుల సంక్షేమం ..భూహక్కుల కోసం ..బ్రిటిష్ వారిపై పోరాడిన మన్యం విప్లవ వీరుడు, అల్లూరి సీతారామరాజు పోరాటం స్ఫూర్తిదాయకమని జాతీయ జర్నలిస్టుల సంఘం కార్యదర్శి,డాక్ యార్డ్ కే టి బి అసోసియేషన్ గౌరవ అధ్యక్షులు, ఆంధ్రప్రదేశ్ వర్కింగ్ జర్నలిస్టుల ఫెడరేషన్ రాష్ట్ర కార్యదర్శి గంట్ల శ్రీనుబాబు అన్నారు.

అల్లూరి సీతారామరాజు 129వ జయంతి సందర్భంగా ద్వారక బస్ కాంప్లెక్స్ వద్ద శనివారం గంట్ల శ్రీనుబాబు అల్లూరి చిత్రపటానికి పూలమాలలు వేసి ఘన నివాళులర్పించారు. ఈ సందర్భంగా గంట్ల శ్రీనుబాబు మాట్లాడుతూ స్వాతంత్ర సమర పోరాటంలో గిరిజనుల కోసం ప్రాణ త్యాగం చేసిన అల్లూరి సీతారామరాజు పోరాటం నేటితరం యువతకు స్ఫూర్తిదాయకంగా నిలుస్తుంది అన్నారు 2019 నుంచి 2022 వరకు అల్లూరి వీరోచిత పోరాటం సాగించారన్నారు.

గెరిల్లా యుద్ధం చేసి బ్రిటిష్ వారిని గడగడలాడించారన్నారు.1924లో ఆయన ను బ్రిటిష్ వారు దారుణంగా కాల్చి చంపారన్నారు.. సీతారామరాజు నేటి తరం యువత కు స్ఫూర్తిదాయకంగా నిలుస్తారు అన్నారు..ఆయన ఆశయ సాధనకు కృషి చేయాలని అన్నారు.

అదేవిధంగా అల్లూరి స్మారక ప్రాంతాల అభివృద్ధికి సైతం ప్రభుత్వం భావితరాలను దృష్టిలో ఉంచుకొని మరింత నిధులు మంజూరు చేసి వాటిని అభివృద్ధి చేయాలని కోరారు.

GOPI, PENDURTHI

GOPI, PENDURTHI

Next Story