Vizag: మహిళా రిజర్వేషన్లపై కాంగ్రెస్ కొత్త డిమాండ్

Vizag: విశాఖ కాంగ్రెస్ సభలో గిడుగు రుద్రరాజు కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలపై విరుచుకుపడ్డారు.

GOPI, PENDURTHI
Published on: 26 April 2026 9:14 PM IST
Vizag
X

Vizag: మహిళా రిజర్వేషన్లపై కాంగ్రెస్ కొత్త డిమాండ్

Vizag: విశాఖపట్నంలోని కాంగ్రెస్ పార్టీ కార్యాలయంలో ఆదివారం ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో సీడబ్ల్యూసీ సభ్యుడు, మాజీ పీసీసీ అధ్యక్షుడు గిడుగు రుద్రరాజు కేంద్ర ప్రభుత్వంపై తీవ్ర విమర్శలు చేశారు. అలాగే రాష్ట్రంలో కూటమి అనుసరిస్తున్న విధానాలను ఆయన ఎండగట్టారు. కూటమి ప్రభుత్వం లో యువత కు ఉపాధి ఎక్కడ అని ప్రశ్నించారు.

కార్పొరేట్ సంస్థలకు ప్రభుత్వ భూములు దారాదత్తం చేసి కేంద్రం మెప్పు పొందుతూ పబ్బం గడుపుతున్నారని విమర్శించారు..పవన్ కళ్యాణ్ గుడులు గోపురాలు అంటూ లడ్డు వివాదం చేసి కాలం గడిపేశారని కూటమి అధికారంలో ఉత్తరాంధ్రలో యువతకి ఉపాధి కరువైందని, గూగుల్ డేటా సెంటర్ ద్వారా ఒరిగింది ఏముందని ఎంత మందికి ఉద్యోగ ఉపాధి దొరుకుతుంది చెప్పగలరా అంటూ ప్రశ్నించారు.

మహిళా రిజర్వేషన్ బిల్లు (రాజ్యాంగ సవరణ బిల్లు, 2026)ను ఎన్డీఏ ప్రభుత్వం రాజకీయ ప్రయోజనాల కోసమే వాడుకుంటోందని ఆయన ఆరోపించారు. *

- డీలిమిటేషన్‌పై అభ్యంతరం:

మహిళా రిజర్వేషన్ల అమలును నియోజకవర్గాల పునర్విభజనతో ముడిపెట్టడం సరికాదని రుద్రరాజు అన్నారు. ఈ చర్య దక్షిణాది రాష్ట్రాల పార్లమెంటరీ ప్రాతినిధ్యాన్ని తగ్గిస్తుందని ఆయన ఆందోళన వ్యక్తం చేశారు.

- కాంగ్రెస్ పార్టీ డిమాండ్లు:

2026-27 జనగణన పూర్తయిన తర్వాతే పారదర్శకంగా రిజర్వేషన్ల ప్రక్రియ చేపట్టాలని డిమాండ్ చేశారు. అలాగే మహిళా కోటాలో ఎస్సీ, బీసీ మహిళలకు సముచిత స్థానం కల్పించాలని కోరారు.

- పార్టీ వైఖరి:

రాహుల్ గాంధీ, ప్రియాంక గాంధీ మహిళా హక్కుల కోసం పార్లమెంటులో గట్టిగా పోరాడుతున్నారని, మహిళా సాధికారతకు కాంగ్రెస్ ఎప్పుడూ కట్టుబడి ఉంటుందని ఆయన స్పష్టం చేశారు.

ఈ సమావేశంలో స్టేట్ యూత్ ప్రెసిడెంట్ లక్కరాజు రామారావు, ఎస్సీ సెల్ మార్టిన్, పి సి సి సెక్రటరీ గాదం మహేష్ ,జిల్లా ఆర్గనైజింగ్ సెక్రటరీ గౌతం, దక్షిణ ఇంచార్జి కే వి సూర్యనారాయణ, ఈస్ట్ ఇంచార్జి ప్రియాంక దండి, మహిళా నాయకురాలు కండవ గాయత్రి , ప్రధాన కార్యదర్శి ఆనంద్ కుమార్,త్రినాథ రావు, సేవాదళ్ అప్పారావు, భాషా,శ్రీధర్ యూత్ కాంగ్రెస్ సెక్రటరీ కె జాహ్నవి,గవర వెంకట రావు,గుప్తా,కనకారావు విశాఖ జిల్లా కాంగ్రెస్ నాయకులు, కార్యకర్తలు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు.

GOPI, PENDURTHI

GOPI, PENDURTHI

Next Story