Visakhapatnam: గీతం ఆసుపత్రికి జీవన్‌దాన్ కిడ్నీ మార్పిడి అనుమతి

Visakhapatnam: గీతం ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సైన్సెస్ (జిమ్‌సర్) ఆసుపత్రికి జీవన్‌దాన్ ద్వారా మూత్రపిండాల మార్పిడి శస్త్రచికిత్సలకు అధికారిక అనుమతి.

SHIVA, BHIMILI
Published on: 8 Aug 2026 9:29 PM IST
Visakhapatnam
X

Visakhapatnam: గీతం ఆసుపత్రికి జీవన్‌దాన్ కిడ్నీ మార్పిడి అనుమతి

విశాఖపట్నం: గీతం విశ్వవిద్యాలయానికి అనుబంధంగా గల గీతం ఇనిస్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సైన్సెస్ అండ్ రీసెర్చి (జిమ్‌సర్) కు చెందిన గీతం ఆసుపత్రి, జీవించి ఉన్న మరియు మరణించిన (మస్తిష్క మరణం పొందిన) దాతల నుండి మూత్రపిండాల మార్పిడి (కిడ్ని ట్రాన్స్‌ప్లాంటేషన్) శస్త్రచికిత్సలను నిర్వహించడానికి జీవన్‌దాస్ సంస్థ నుండి అధికారిక అనుమతి పొందిందని ఆసుపత్రి పరిపాలన అధికారి డాక్టర్ బి.కార్తిక్ తెలిపారు.

జీవన్‌దాన్ కార్యక్రమం క్రింది ట్రాన్స్‌ప్లాంట్ ప్రోగ్రామ్‌కు నెఫ్రాలజీ, యురాలజీ మరియు ట్రాన్స్‌ప్లాంట్ సర్జరీ, అనస్థీషియాలజీ, క్రిటికల్ కేర్, రేడియాలజీ మరియు లేబొరేటరీ మెడిసిన్ వంటి వివిధ విభాగాలకు చెందిన సీనియర్ వైద్య నిపుణులు మరియు ప్రత్యేక శిక్షణ పొందిన ఆరోగ్య సంరక్షణ సిబ్బంది నేతృత్వం వహిస్తున్నారని ఆయన పేర్కొన్నారు.

కిడ్ని మార్పిడి సేవలు తగిన వైద్య మూల్యాంకనం, చట్టబద్దమైన నిబంధనలకు కట్టుబడి ఉండటం, జీవన్‌దాన్ విధానాలు మరియు ప్రభుత్వ అవయవ మార్పిడి చట్టాలకు లోబడి అందుబాటులో ఉంటాయని ఆయన తెలిపారు. జీవన్‌దాన్ అమలుకు గీతం ఆసుపత్రిలో దాత మరియు స్వీకర్త ఇద్దరికీ ప్రత్యేకంగా రూపొందించిన అత్యాధునిక శస్త్రచికిత్స థియేటర్లు మరియు ఆధునిక సదుపాయాలతో కూడిన ప్రత్యేక కిడ్నీ ట్రాన్స్‌ప్లాంట్ విభాగాన్ని సమగ్రంగా అందుబాటులోకి తెచ్చామని ఆయన పేర్కొన్నారు.

73 ఐసియు బెడ్లతో కూడిన 750 పడకలు గల గీతం బోధన ఆసుపత్రి అత్యుత్తమ అవస్థాపన సదుపాయాలు మరియు అనుభవజ్ఞులైన నిపుణుల బృందంతో విస్తృత స్థాయి వైద్య, శస్త్రచికిత్స మరియు సూపర్ స్పెషాలిటి సేవలను అందిస్తోందని ఆయన వెల్లడించారు. గీతం ఆసుపత్రిలో జనరల్ మెడిసిన్, జనరల్ సర్జరీ, కార్డియాలజీ, కార్డియోథొరాసిక్ మరియు వాస్కులర్ సర్జరీ (సిటివిఎస్),

న్యూరాలజీ, న్యూరోసర్జరీ, నెఫ్రాలజీ, ఎండోక్రైనాలజీ, గ్యాస్ట్రోఎంటరాలజీ, సర్జికల్ గ్యాస్ట్రోఎంటరాలజీ, యురాలజీ, సర్జికల్ ఆంకాలజీ, ఆర్ధోపెడిక్స్, పీడియాట్రిక్స్, ప్రసూతి మరియు స్త్రీ వైద్య విభాగం, పల్మోనాలజీ, ఈఎన్టీ, ఆప్తాల్మాలజీ, డెర్మటాలజీ, సైకియాట్రీ, ఎమర్జన్సీ మెడిసిన్, క్రిటికల్ కేర్, రేడియాలజీ, ఇంటర్వెన్షనల్ రేడియాలజీ మరియు అనస్థీషియాలజీ వంటి అనేక ప్రత్యేక విభాగాలు ప్రజలకు సేవలు అందిస్తున్నాయని ఆయన తెలిపారు.

SHIVA, BHIMILI

SHIVA, BHIMILI

Next Story