Anakapalli: గొన్న ఇంజనీరింగ్ కళాశాల లైబ్రేరియన్‌కు జాతీయ పురస్కారం!

Anakapalli: పరవాడ మండలం గొన్న ఇంజనీరింగ్ కళాశాల లైబ్రేరియన్ ఆకెళ్ళ శ్యామలరావుకు ప్రతిష్టాత్మక మద్రాస్ లైబ్రేరియన్ అసోసియేషన్ జాతీయ అత్యుత్తమ సేవా పురస్కారం దక్కింది.

CHANDRA SHEKAR, PARAWADA
Published on: 16 Aug 2026 6:35 PM IST
Anakapalli
X

Anakapalli: గొన్న ఇంజనీరింగ్ కళాశాల లైబ్రేరియన్‌కు జాతీయ పురస్కారం!

అనకాపల్లి జిల్లా: మద్రాస్ లైబ్రేరియన్ అసోసియేషన్ ప్రతి సంవత్సరం ప్రకటించే అవార్డులు 2026 వ సంవత్సరానికి గొన్న ఇంజనీరింగ్ కళాశాలలో లైబ్రేరియన్ గా పనిచేస్తున్న ఆకెళ్ళ శ్యామలరావు కు దక్కింది.ఈ అవార్డు చెన్నై లో అన్న సెంటినరీ లైబ్రరీ లో ఈరోజు జరిగిన కార్యక్రమంలో ద్రవిడియన్ యూనివర్సిటీ మాజీ ఉపకులపతి డాక్టర్. ఎం. దొరస్వామి చేతుల మీదుగా అందుకోనున్నారు.

లైబ్రేరియన్ గా చేసిన కృషి కి ఈ గుర్తింపు దక్కిందని శ్యామలరావు అన్నారు. ఈ అవార్డు రావడం తో లైబ్రరీ కి చేసిన కృషి కి మంచి గుర్తిపు లభించిందని శ్యామలరావు అన్నారు. కళాశాల సెక్రటరీ హేమ్ చంద్ నాయుడు, ప్రిన్సిపాల్ డా. మూర్తి, తోటి ఆచార్యులు శ్యామలరావు కు అభినందనలు తెలియచేసారు.

CHANDRA SHEKAR, PARAWADA

CHANDRA SHEKAR, PARAWADA

Next Story