Anakapalli: గోవాడ చెరకు రైతులకు ఇచ్చిన మాట నిలబెట్టుకున్నాం: ఎంపీ సీఎం రమేష్!
Anakapalli: గోవాడ చెరకు రైతులకు రూ.28.43 కోట్ల బకాయిల చెల్లింపునకు ప్రభుత్వం నిర్ణయం: ఇచ్చిన మాట నిలబెట్టుకున్నామని ఎంపీ సీఎం రమేష్ హర్షం, సీఎం చంద్రబాబుకు ధన్యవాదాలు.
Anakapalli: గోవాడ చెరకు రైతులకు ఇచ్చిన మాట నిలబెట్టుకున్నాం: ఎంపీ సీఎం రమేష్!
అనకాపల్లి: గోవాడ షుగర్ ఫ్యాక్టరీకి చెరకు సరఫరా చేసిన రైతుల బకాయిల చెల్లింపునకు ప్రభుత్వం నిర్ణయం తీసుకోవడం పట్ల రైల్వే స్టాండింగ్ కమిటీ చైర్మన్, అనకాపల్లి ఎంపీ డాక్టర్ సీఎం రమేష్ హర్షం వ్యక్తం చేశారు. సుమారు రూ.28.43 కోట్ల బకాయిలను రైతులకు చెల్లించేందుకు ప్రభుత్వం తీసుకున్న నిర్ణయం వారికి ఎంతో ఊరటనిస్తుందని తెలిపారు.
గోవాడ చెరకు రైతుల బకాయిల సమస్యను చోడవరం ఎమ్మెల్యే కేఎస్‌ఎన్‌ఎస్ రాజుతో కలిసి గతంలోనే ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు దృష్టికి తీసుకెళ్లినట్లు ఎంపీ సీఎం రమేష్ తెలిపారు. రైతుల సమస్య పరిష్కారం కోసం అప్పటి నుంచి సంబంధిత మంత్రులు, అధికారులు, ప్రభుత్వ పెద్దలతో పలుమార్లు చర్చించి, నిరంతరం ఫాలోఅప్ చేస్తూ వచ్చినట్లు పేర్కొన్నారు.
ఎన్నికల సమయంలో గోవాడ చెరకు రైతుల బకాయిల సమస్యను పరిష్కరించేందుకు కృషి చేస్తామని ఇచ్చిన హామీ మేరకు సమస్యను ఎప్పటికప్పుడు ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లామని తెలిపారు. తాజాగా బకాయిల చెల్లింపునకు ప్రభుత్వం నిర్ణయం తీసుకోవడంతో రైతుల సమస్య పరిష్కారం దిశగా కీలక ముందడుగు పడిందన్నారు.
రైతుల సమస్యను సానుకూలంగా పరిశీలించి బకాయిల చెల్లింపునకు నిర్ణయం తీసుకున్న ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు, ఉపముఖ్యమంత్రి పవన్ కల్యాణ్, కేబినెట్ మంత్రులకు ఎంపీ సీఎం రమేష్ ప్రత్యేక ధన్యవాదాలు తెలిపారు. సమస్యను ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లిన ప్రతిసారీ సానుకూలంగా స్పందించి పరిష్కారం దిశగా చర్యలు తీసుకున్న సంబంధిత మంత్రులు, ప్రజాప్రతినిధులు, అధికారులకు కృతజ్ఞతలు తెలిపారు.




