Vizag: విశాఖలో వైభవంగా వాసవి జయంతి ఉత్సవాలు

Vizag: విశాఖపట్నం వన్ టౌన్ కన్యకా పరమేశ్వరి అమ్మవారి 149వ జయంతి ఉత్సవాలు ఘనంగా జరిగాయి.

GOPI, PENDURTHI
Published on: 26 April 2026 3:22 PM IST
Vizag
X

Vizag: విశాఖలో వైభవంగా వాసవి జయంతి ఉత్సవాలు

Vizag: విశాఖపట్నం వన్ టౌన్ ప్రాంతంలో 149 సంవత్సరాల చరిత్ర గల కన్యకా పరమేశ్వరి అమ్మవారి దేవాలయంలో 26వ తేదీ ఆదివారం నాడు వైశాఖ శుద్ధ దశమి సందర్భంగా కన్యకాపరమేశ్వరి అమ్మవారి జయంతి మహోత్సవమును ఘనంగా నిర్వహించినట్లు దేవాలయ సంఘ అధ్యక్షులు కార్యదర్శులు శ్రీయుతులు అరిశెట్టి దినకర్, పెనుగొండ కామరాజు ఒక ప్రకటనలో తెలిపారు.

ఆదివారం తెల్లవారుజామున ఐదు గంటలకు సుప్రభాతంతో మొదలై ప్రత్యేక క్షీరాభిషేకం, అమ్మవారికి రజిత వస్త్రాలంకరణ, స్వర్ణపుష్పములతో ప్రత్యేక పూజా కార్యక్రమం, దేవాలయ ప్రాంగణంలో దేవాలయ ఆస్థాన ప్రధాన పురోహితులు శ్రీ ఆర్.బి.బి. కుమారశర్మ గారి నేతృత్వంలో జరిగిన ఆధ్యాత్మిక కార్యక్రమాల్లో భాగంగా మహిళలచే సామూహిక కుంకుమ పూజలు,

వాసవి మూలమంత్ర హోమం వంటి కార్యక్రమాలతో పాటు మధ్యాహ్నం 12 గంటలకు 500 మంది పేదలకు అన్నదానం (అన్న సమారాధన) నిర్వహించినట్లు తెలిపారు. నగరంలోని ఆర్యవైశ్య ప్రముఖులు శ్రీయుతులు కంకటాల మల్లిక్, పైడా కృష్ణప్రసాద్ మరియు డాక్టర్ ఉప్పల భాస్కరరావు తదితరులు అమ్మవారిని దర్శించుకుని తీర్థప్రసాదములు గైకొన్నారు.

ఈ సందర్భంగా వాసవిక్లబ్ విశాఖపట్నం V201 వార్ అమ్మవారికి 102 రకాల స్వీట్స్ నివేదన జేశారు. కార్యక్రమ నిర్వహణా కమిటి చైర్మెన్స్ శ్రీయుతులు పూసర్ల సురేష్ కుమార్ మరియు సుగ్గుశివ కుమార్ లు మాట్లాడుతూ ఆర్యవైశ్య యువజన సంఘం, వాసవి కళ్యాణ మండప సంఘం మరియు విశాఖ నగరంలో పలు ప్రాంతాల్లో గల ఆర్యవైశ్య సంఘాలు, మరియు వివిధ వాసవి క్లబ్స్ ల సంయుక్త సహకారంతో నిర్వహించిన ఈ కార్యక్రమంలో

ఉదయం ఆరు గంటలకు దేవాలయం పరిసర ప్రాంతంలో నిర్వహించిన శోభాయాత్రలో భగవన్నామ సంకీర్తనలుతోపాటు ఏకరూప వస్త్రధారణ లో భారీ సంఖ్యలో మహిళలు, పురుషులు పాల్గొన్నారని తెలిపారు.

ఈ కార్యక్రమంలో దేవాలయ సంఘ కార్యదర్శి పెనుగొండ కామరాజు, కోశాధికారి శ్రీ దోమ వెంకట బాలాజీ కుమార్, మాజి అధ్యక్షుడు పెనుగొండ చంద్రశేఖర్, యువజన సంఘం అధ్యక్ష కార్యదర్శులు నేతి శ్రీనివాస రావు, కట్టమూరి సూర్యనారాయణ వాసవి కళ్యాణ మండప సంఘ కార్యదర్శి నున్న కృష్ణారావు, వాసవి క్లబ్ ప్రతినిధులు తమ్మన అమరనాధ్,

మరియు బొడ్డు రఘు, నల్లూరి నూకరాజు, కంకటాల సతీష్, కడిమిశెట్టి వెంకటరమణ, పాలూరి వరప్రసాద్, సుగ్గు అరుణకుమార్, గ్రంధి దుర్గాప్రసాద్, జీ.వీ.యార్. కుమార్, పూసర్ల సంజీవరావు, కొత్త అరుణకుమార్, దుర్గ నూకేశ్వరరావు, సీ.వి.ఎన్. రామకృష్ణ, వివిధ వైశ్య సంఘాలు, వాసవిక్లబ్స్ సభ్యులు తదితరులు పాల్గొన్నారు.

GOPI, PENDURTHI

GOPI, PENDURTHI

Next Story