Visakhapatnam: మధురవాడలో వైభవంగా శ్రీ లక్ష్మీ, లలితా గణపతి పూజలు!

Visakhapatnam: విశాఖపట్నం మధురవాడ ఆనంద్ నివాస్‌లో శ్రీ వినాయక మహోత్సవాలు వైభవంగా ప్రారంభమయ్యాయి.

JAI RAM, MADURAWADA
Published on: 15 Sept 2026 8:00 PM IST
Visakhapatnam
X

Visakhapatnam: మధురవాడలో వైభవంగా శ్రీ లక్ష్మీ, లలితా గణపతి పూజలు!

విశాఖపట్నం: విశాఖపట్నం మధురవాడ ఉజ్వల హాస్పిటల్ సమీపంలోని ఆనంద్ నివాస్‌లో శ్రీ వినాయక మహోత్సవాలు ఘనంగా ప్రారంభమయ్యాయి. మూడు రోజుల పాటు నిర్వహించనున్న ఈ ఉత్సవాల్లో భాగంగా ఉదయం వేద మంత్రోచ్ఛారణల నడుమ శ్రీ వినాయక స్వామివారిని భక్తిశ్రద్ధలతో ప్రతిష్ఠించారు.

సాయంత్రం శ్రీ లక్ష్మీ, లలితా గణపతి పూజలను శ్రీమతి నేతేటి విజయలక్ష్మి ఆధ్వర్యంలో నిర్వహించారు. ఈ పూజా కార్యక్రమంలో మహిళలు పెద్ద సంఖ్యలో పాల్గొని భక్తిశ్రద్ధలతో స్వామివారిని పూజించారు. వినాయకుడి ఆశీస్సులతో ప్రతి కుటుంబం సుఖసంతోషాలతో ఉండాలని భక్తులు ఆకాంక్షించారు.

మూడు రోజుల పాటు వైభవంగా జరిగే ఈ వినాయక మహోత్సవాల్లో భాగంగా బుధవారం అన్నసంతర్పణ కార్యక్రమాన్ని నిర్వహించనున్నట్లు ఉత్సవ నిర్వాహకులు నేతేటి ప్రసాద్ తెలిపారు.

భక్తులందరూ ఈ కార్యక్రమాల్లో పాల్గొని స్వామివారి కృపకు పాత్రులు కావాలని నిర్వాహకులు కోరారు. ఈ కార్యక్రమంలో జగన్నాథం,తదితరులు భక్తులు పాల్గొన్నారు.

JAI RAM, MADURAWADA

JAI RAM, MADURAWADA