Visakhapatnam: నా వ్యాఖ్యలు మహిళలపై కాదు.. హోంమంత్రి అనిత భాషపైనే

Visakhapatnam: నా వ్యాఖ్యలు మహిళా లోకంపై కాదు.. హోంమంత్రి అనిత సంస్కారహీన భాషపైనే అని మాజీ మంత్రి గుడివాడ అమర్నాథ్ స్పష్టం చేశారు.

GOPI, PENDURTHI
Published on: 17 Jun 2026 7:42 PM IST
Visakhapatnam
X

Visakhapatnam: నా వ్యాఖ్యలు మహిళలపై కాదు.. హోంమంత్రి అనిత భాషపైనే

విశాఖపట్నం: విశాఖపట్నం వైయస్సార్సీపీ కార్యాలయంలో మీడియాతో మాట్లాడిన వైయస్సార్సీపీ పశ్చిమగోదావరి రీజనల్ కోఆర్డినేటర్, మాజీమంత్రి గుడివాడ అమర్నాధ్- బ్రేకింగ్ పాయింట్స్. విశాఖ వైయస్సార్సీపీ కార్యాలయంలో మీడియా సమావేశంలో మాట్లాడిన మాజీమంత్రి గుడివాడ అమర్నాధ్. మూడు రోజుల తర్వాత గుర్తొచ్చిన బాధ.. టీడీపీ పొలిటికల్ డ్రామా

రాజకీయ లబ్ధి కోసమే ఈ అంశాన్ని టీడీపీ వివాదం చేస్తోంది :

ఆగ్రహం వ్యక్తం చేసిన గుడివాడ అమర్నాధ్. మా కుటుంబం మూడు తరాలుగా రాజకీయాలలో ఉంది. మహిళల పట్ల మాకు అపారమైన గౌరవం ఉంది. నాతో సహా మా పార్టీ అధ్యక్షుడి పైనా అభ్యంతరకర వ్యాఖ్యలు చేసిన హోంమంత్రి ప్రజలందరూ టీడీపీ నేతల భాషను మరోసారి కళ్లారా చూశారు. వాస్తవాలను ప్రజలు అర్ధం చేసుకున్నారు. నేను నా వ్యాఖ్యలకు కట్టుబడి ఉన్నాను. మా పార్టీ నేతలపైనా, అధినేతపైనా నోరు జారితే మరింత గట్టిగా స్పందిస్తాం.

టీడీపీ ఫేక్ ఉద్యమాలు ఆపాలి:

తేల్చి చెప్పి మాజీ మంత్రి గుడివాడ అమర్నాద్.

విశాఖపట్నం: గడిచిన కొద్దిరోజులుగా తనపై తెలుగుదేశం పార్టీ నాయకులు ఒక ప్రణాళిక ప్రకారం అబద్ధాలతో దుష్ప్రచారం చేస్తున్నారని వైయస్సార్సీపీ రీజనల్ కోఆర్డినేటర్, మాజీ మంత్రి గుడివాడ అమర్నాథ్ మండిపడ్డారు.విశాఖపట్నం వైయస్సార్సీపీ కార్యాలయంలో మీడియాతో మాట్లాడుతూ.. తాను మాట్లాడిన మాటలు యావత్ మహిళా లోకాన్ని ఉద్దేశించినవి కావని, గతంలో వైయస్ విజయమ్మ, భారతమ్మలపై అత్యంత నీచంగా మాట్లాడిన హోంమంత్రి అనిత సంస్కారహీన భాషను మాత్రమే తాను ఖండించానని స్పష్టం చేశారు.

మహిళల పట్ల ఉండే గౌరవానికి పార్టీ రంగులతో సంబంధం లేదని, తన ఇంట్లోని ఆడబిడ్డలైనా, ఎదుటివారి కుటుంబ మహిళలైనా తనకు ఒక్కటే గౌరవమని, దీనిపై టీడీపీ నేతలు తనకు పాఠాలు చెప్పాల్సిన అవసరం లేదని స్పష్టం చేశారు. మూడు తరాల ఘనమైన రాజకీయ చరిత్ర ఉన్న కుటుంబ నేపధ్యమున్న తాము ఎప్పుడూ అసభ్యంగా మాట్లాడలేదని స్పష్టం చేశారు. మాజీ మంత్రి అన్న గౌరవం కూడా లేకుండా తనను పట్టుకుని 'వాడెవడు' అని అనిత ప్రశ్నించడం ఆమె అహంకారానికి నిదర్శనమన్నారు.

"ఆడది కనిపిస్తే ముద్దైనా పెట్టాలి, కడుపైనా చేయాలి" అన్న బాలకృష్ణ వ్యాఖ్యలపై నీతులు చెబుతున్న చంద్రబాబు, లోకేష్, పవన్ కళ్యాణ్‌లు సమాధానం చెప్పాలని డిమాండ్ చేశారు. రాష్ట్రంలో 790 హత్యలు, వేలాది అఘాయిత్యాలు జరుగుతూ లా అండ్ ఆర్డర్ పూర్తిగా వైఫల్యం చెందినా పట్టించుకోని హోంమంత్రి.. గంజాయి స్మగ్లర్ తప్పించుకుంటే సమాధానం చెప్పలేక అధికారుల వైపు తెల్లమొహం వేస్తున్నారని ఎండగట్టారు.

జూన్ 12న జరిగిన 'వెన్నుపోటుకు రెండేళ్ల' కార్యక్రమంలో నేను మాట్లాడితే.. ఆ రోజు నుంచి లేని బాధ టీడీపీ నేతలకు జూన్ 14న (మూడు రోజుల తర్వాత) వచ్చింది. నా మాటలను రాజకీయంగా వాడుకోవాలనే దురుద్దేశంతోనే మహిళలు, దళితులు అంటూ కొత్త సెంటిమెంట్లు తెరపైకి తెచ్చారని మండిపడ్డారు. ఈ సందర్బంగా ఇంకా ఏమన్నారంటే..

కార్యకర్తలకు భరోసాగానే:

గడిచిన రెండేళ్ల కూటమి పాలనలో మా నాయకుడిపై, మాపై చేసిన వ్యక్తిగత, అసభ్యకర ఆరోపణలను ఖండిస్తూ నేను మాట్లాడాను. వైయస్సార్సీపీ నేతలు, సోషల్ మీడియా కార్యకర్తలపై అక్రమ కేసులు పెడుతూ భయభ్రాంతులకు గురిచేస్తుంటే.. ఈ ప్రాంత నాయకుడిగా మా వాళ్లకు భరోసా ఇవ్వడానికే నేను అలా ప్రతిస్పందించాను. నేను మాట్లాడిన మాటలకు కట్టుబడి ఉన్నాను, భవిష్యత్తులోనూ ఇలాగే నోరుపారేసుకుంటే ఇదే తరహా సమాధానం ఉంటుంది.

'వాడెవడు' అంటూ మాట్లాడిన హోం మంత్రి అనితకు గుడివాడ అమర్నాథ్ కుటుంబం మూడు తరాలుగా రాజకీయాల్లో ఉందన్న విషయం తెలుసుకోవాలి. (ప్రెస్ మీట్‌లో హోం మంత్రి అనిత గతంలో మాట్లాడిన అసభ్యకర, అగౌరవ వ్యాఖ్యల వీడియో ప్రజెంటేషన్‌ ద్వారా మీడియాకు వివరించిన గుడివాడ అమర్నాథ్.)

మూడు తరాల చరిత్ర: ‘ఎవడాడు? వాడు ఎవడు?’ అని హోంమంత్రి అనిత అడుగుతున్నారు. వాడు ఎవడో ఆమెకు తెలియకపోవచ్చు.. కానీ ఉమ్మడి విశాఖపట్నం జిల్లాలో ఏ రాజకీయ కుటుంబానికి లేని ఘనమైన చరిత్ర ఉన్న ఇల్లు నాది. 1976 నుంచి మూడు తరాలుగా ఈ జిల్లాలో రాజకీయం చేస్తూ, గతంలో రాష్ట్ర మంత్రిగా బాధ్యతలు నిర్వర్తించిన ఆ గుడివాడ అమర్నాథ్‌నే నేను. బాధ్యతాయుతమైన పదవిలో ఉండి ఒక మాజీ మంత్రిని పట్టుకుని ‘వాడెవడు’ అనడం మీ సంస్కారమా?

గతంలో వైయస్ విజయలక్ష్మి గారు, వైయస్ భారతి గారి గురించి అత్యంత నీచాతి నీచమైన భాషలో అనిత మాట్లాడినప్పుడు.. ఇవాళ గొంతు చించుకుంటున్న టీడీపీ మంత్రులు, నేతలు ఎక్కడ దాక్కున్నారు? ఆ రోజు అనితను ఎందుకు సంజాయిషీ అడగలేదు?

ఉత్తరాంధ్రా సంస్కృతిని కాలరాశారు:

రాజకీయాలకు అతీతంగా ఉత్తరాంధ్రా నేతల మధ్య స్నేహపూర్వక, సహృద్భావ వాతావరణం ఉండేది. కానీ ఇక్కడి సాంప్రదాయాన్ని అనిత పూర్తిగా కాలరాశారు. సామాన్య కార్యకర్తలు ప్రశ్నిస్తే 30-40 పోలీస్ స్టేషన్లలో కేసులు పెట్టి వేధిస్తున్నారు. ఆడది కనిపిస్తే కడుపైనా చేయాలన్న బాలకృష్ణ మాటలు లోకేష్‌కు వినపడలేదా? మహిళా గౌరవం గురించి నీతులు చెబుతున్న ముఖ్యమంత్రి చంద్రబాబు, మంత్రి లోకేష్‌లకు వారి సొంత నేతల చరిత్రలు గుర్తులేవా? ఆడది కనిపిస్తే ముద్దైనా పెట్టాలి.. కడుపైనా చేయాలి అని లోకేష్ మామయ్య బాలకృష్ణ మాట్లాడారు. అదా మహిళలపై మీకున్న గౌరవం? దీనిపై మంత్రి లోకేష్ సమాధానం చెప్పాలి.

ప్రస్తుత టీడీపీ ఎమ్మెల్యే చింతమనేని ప్రభాకర్ ప్రతిపక్షంలో ఉన్నప్పుడు ఆరోగ్యశాఖ మంత్రిగా ఉన్న విడదల రజినిపై చేసిన దారుణ వ్యాఖ్యలు మీకు వినపడలేదా? మాజీ మంత్రి రోజా గారిని 'వ్యాంప్ క్యారెక్టర్' అని టీడీపీ నేత గాలి భానుప్రకాష్ కించపరిస్తే ఏ రోజైనా మీ పార్టీ మహిళలతో ప్రెస్ మీట్లు పెట్టించారా? చంద్రబాబు గారు మీరు అమ్మ, అమ్మమ్మలను లాగుతూ మాట్లాడిన నీచమైన భాష మీకు గుర్తులేదా? టీవీ5 సాంబశివరావు, టీడీపీ నేత పట్టాభి ల భాష మర్చిపోయారా? ఐటీడీపీ (iTDP) సంస్థ పేరిట టీడీపీ ఆఫీస్ నుంచే మహిళలను అసభ్యంగా తిడుతూ పోస్టులు పెడుతున్నారు. మీ అనుకూల మీడియా ప్రతినిధి టీవీ5 సాంబశివరావు సినిమా పరిశ్రమలోని మహిళలను ఉద్దేశించి మాట్లాడిన బూతు పురాణంపై ఎందుకు మాట్లాడలేదు ?

శాంతిభద్రతలు అట్టర్ ప్లాప్.. గంజాయి నిందితుడిపై హోంమంత్రి తెల్లమొహం

కూటమి ప్రభుత్వ రెండేళ్ల పాలన అట్టర్ ప్లాప్ అయింది. ప్రజా సమస్యల నుంచి దృష్టి మళ్లించడానికే ఈ రాద్ధాంతం చేస్తున్నారు. హోంమంత్రి పక్క నియోజకవర్గంలో 4 ఏళ్ల చిన్నారి 'జ్ఞానేశ్వరి' తప్పిపోయి 11 రోజులు అవుతున్నా.. ఆ తల్లిదండ్రులకు భరోసా ఇచ్చే కనీస ఆలోచన ఎందుకు రాలేదు. రెండేళ్ల కూటమి పాలనలో రాష్ట్రంలో 790 మంది హతమయ్యారు, 30 రాజకీయ హత్యలు జరిగాయి, వేలాది మంది మహిళలపై అఘాయిత్యాలు జరిగాయి.

లాకప్ డెత్‌లు జరుగుతున్నాయి, డియస్సీలో ఉద్యోగాలు అమ్మేసుకుంటున్నారు, ఆక్వా రైతులు ఫీడ్ రేట్లు పెరిగి రోడ్డున పడ్డారు. వీటిపై ప్రశ్నిస్తే 'మహిళా సెంటిమెంట్' తెస్తారా? గంజాయి స్మగ్లర్ 'సోహైల్' పోలీసుల నుంచి ఎలా తప్పించుకున్నాడని పాత్రికేయులు అడిగితే.. హోంమంత్రి సమాధానం చెప్పలేక తెల్లమొహం వేసి అధికారుల వైపు చూస్తున్నారు.

ప్రతిపక్షంలో ఉన్నప్పుడు 30 వేల మంది మహిళలు అపహరణకు గురయ్యారని, వారిని వెనక్కి తెస్తామని చెప్పిన డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్.. ఈ రెండేళ్లలో ఎంతమందిని వెనక్కి తెచ్చారో హోంమంత్రే సమాధానం చెప్పాలి. నాపై కేసులు పెడుతున్నామని బెదిరిస్తున్నారు.. రాష్ట్రంలోనే కాదు జాతీయ, అంతర్జాతీయ స్థాయిలో ఫిర్యాదు చేసినా నేను భయపడనని గుడివాడ అమర్నాధ్ స్పష్టం చేసారు.

దళితులు, మహిళలపై వైయస్సార్సీపీదే నిజమైన కమిట్ మెంట్..

అనంతరం పాత్రికేయుల ప్రశ్నలకు సమాధానమిస్తూ.. మహిళలను హోంమంత్రిని చేయాలనే గొప్ప ఆలోచన మొదట చేసింది దివంగత నేత వైయస్ రాజశేఖర రెడ్డి గారైతే.. ఒక దళిత మహిళను హోంమంత్రిగా కూర్చోబెట్టిన ఘనత వైయస్ జగన్ దే. "దళితులుగా ఎవరైనా పుట్టాలనుకుంటారా" అని అవమానించిన చంద్రబాబుకు, ఆయన కూటమి నేతలకు మహిళల గురించి మాట్లాడే అర్హత లేదని తేల్చి చెప్పారు.

GOPI, PENDURTHI

GOPI, PENDURTHI

Next Story