Anakapalle: సీఎం రమేష్‌పై మాజీ మంత్రి అమర్‌నాథ్ తీవ్ర ఆగ్రహం!

Anakapalle: అనకాపల్లి ఎంపీ సీఎం రమేష్‌పై మాజీ మంత్రి గుడివాడ అమర్‌నాథ్ ఘాటు వ్యాఖ్యలు. 'నేను పాలు తాగి పెరిగిన కుటుంబం.. నీలా నాటుసారా అమ్మలేదు' అంటూ తీవ్ర ధ్వజం.

JAGADISH BABU, CHODAVARAM
Published on: 18 Sept 2026 11:16 AM IST
Anakapalle
X

Anakapalle: సీఎం రమేష్‌పై మాజీ మంత్రి అమర్‌నాథ్ తీవ్ర ఆగ్రహం!

Anakapalle: అనకాపల్లి జిల్లా చోడవరం నియోజకవర్గం బుచ్చెయ్యపేట లో పార్టీ కార్యక్రమనికి హాజరైన మాజీ మంత్రి గుడివాడ అమర్నాధ్ అనకాపల్లి ఎంపీ సీఎం రమేష్ పై తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా అమర్నాధ్ సీఎం రమేష్ ను ఉద్దేశించి మాట్లాడుతూ 'నీలా నాటు సారా తాగి, అమ్మి

అడ్డదారిలో వచ్చిన వాడిని కాను.. పాలు తాగి రాజ కీయ చరిత్ర ఉన్న కుటుంబం నుంచి పైకి వచ్చిన వాడిని' అంటూ తీవ్ర స్థాయిలో సీఎం రమేష్ పై ధ్వజమెత్తారు. చోడవరం నియోజకవర్గంలో పార్టీ కార్యక్రమాల్లో పాల్గొనడానికి వచ్చిన అనకాపల్లి ఎంపీ సి.ఎం రమేష్ మాజీ మంత్రి అమర్నాథ్ ను ఉద్దేశించి చేసిన అనుచిత వ్యాఖ్యలపై ఆయన ఘాటుగా స్పందిం చారు.

బుచ్చెయ్యపేట విచ్చేసిన అమర్ నాథ్ మాట్లాడుతూ కడపలో ఎక్కడో మారుమూల గ్రామంలో పుట్టి చింతకుంట మునిస్వామి రమేష్ వైన నీవు సి.ఎం రమేష్ సొంత పేరు చెప్పకోలేని నీవు నా గురించి అనుచిత వ్యాఖ్యలు చేస్తావా అంటూ మండిపడ్డారు. మా తాత, నాన్న, నేను ఎమ్మె ల్యేగా, ఎంపీగా, మంత్రిగా ప్రజలకు సేవలందించా మని, మాపై అనుచిత వాఖ్యలు చేయడం నీకు తగ దన్నారు.

నాటు సారా వ్యాపారం చేసుకుంటూ 1989లో బూత్ ఏజెంట్గా వచ్చిన నీకు ఈ రోజు రూ.వేల కోట్లు ఎలా వచ్చాయో ప్రజలకు చెప్ప గలవా అంటూ ప్రశ్నించారు. ఇటు బీజేపీతో, అటు టీడీపీతో రాజకీయ వ్యభిచారం, బ్రోకర్ పనులు చేసే నీవు నీతులు మాట్లాడడాన్ని ఇక్కడి ప్రజలు హర్షించరని ఎద్దేవా చేశారు. కడపలో చెల్లని రూపా యివైన నీవు అనకాపల్లి వచ్చి ఇక్కడి పంచభూతా లను దోచుకుంటున్న నీ చరిత్రను ఢిల్లీగడ్డపై తెలి సేలా చేశానన్నారు.

ప్రజలే బుద్ది చెబుతారు. అధికారంలోకి వస్తే అభివృద్ధి చేస్తానని మాయమా టలు చెప్పి సి.ఎం రమేష్ రెండున్నరేళ్లు అయినా గోవాడ సుగర్ ఫ్యాక్టరీలో రైతులకు, ఉద్యోగులకు ఇవ్వాల్సిన రూ.35 కోట్లు నిధులు మంజూరు చేయలేకపోయారని విమర్శించారు. గోవాడ సుగర్ ఫ్యాక్టరీని పూర్తిగా మూయించి ఫ్యాక్టరీ భూమిని కారు చౌకగా లాక్కోవడానికి ప్రయత్నించారని అమ ర్నాథ్ మండిపడ్డారు. అమర్నాథ్ లోకల్.. అని చెబుతూ అధికారం కోల్పోతే నీవు ఎవరో కూడా ఇక్కడ ప్రజలకు తెలియదని, ఇకనైనా ఎంపీ వ్యక్తి గత విమర్శలు మానుకుని ప్రజా సంక్షేమానికి కృషి చేస్తే మంచిదని, లేకపోతే ప్రజలే తగిన బుద్ధి చెబుతారని అమర్ నాథ్ హెచ్చరించారు.

JAGADISH BABU, CHODAVARAM

JAGADISH BABU, CHODAVARAM