Bheemili: కూటమి అభ్యర్థి గరే సదానందను గెలిపించండి: రవితేజ!
Bheemili: జీవీఎంసీ 2వ వార్డు కూటమి అభ్యర్థి గరే సదానంద విజయాన్ని కాంక్షిస్తూ భీమిలిలో టీడీపీ యువనేత గంటా రవితేజ విస్తృతంగా ఇంటింటి ప్రచారం నిర్వహించారు.
Bheemili: కూటమి అభ్యర్థి గరే సదానందను గెలిపించండి: రవితేజ!
భీమిలి: జీవీఎంసీ 2వ వార్డులో కూటమి అభ్యర్థి గరే సదానంద గారి విజయాన్ని కాంక్షిస్తూ టీడీపీ యువనేత గంటా రవితేజ గారు ఇంటింటి ప్రచారం నిర్వహించారు. ఈ సందర్భంగా వార్డులోని ప్రజలను నేరుగా కలుసుకుని, కూటమి అభ్యర్థికి మద్దతు తెలిపి విజయాన్ని అందించాలని కోరారు. ప్రజలతో మమేకమవుతూ కూటమి అభ్యర్థి విజయానికి మూడు పార్టీల నాయకులు, కార్యకర్తలు సమష్టిగా కృషి చేయాలని పిలుపునిచ్చారు.
ఈ ప్రచార కార్యక్రమంలో భీమిలి నియోజకవర్గ జనసేన సమన్వయకర్త పంచకర్ల సందీప్, టీడీపీ నాయకులు చోడిపల్లి సాయి, బార్ల రాయలు, షేక్ ఇస్మాయిల్, జోగా సన్యాసిరావు, జనసేన నాయకులు పరిమి భువనేశ్వరి, పరిమి ప్రీతం, బీజేపీ నాయకులు అయినాడ మాధవరావు, ఇతర కూటమి నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.




