Visakhapatnam: వ్యర్ధాలు బహిరంగ ప్రదేశాలలో పడవేస్తే సహించేది లేదు!
Visakhapatnam: విశాఖలో జీవీఎంసీ కమిషనర్ కేతన్ గార్గ్ ఆకస్మిక తనిఖీ. శతశాతం చెత్త సేకరణ జరగకపోతే ఊరుకునేది లేదని హెచ్చరిక.
Visakhapatnam: వ్యర్ధాలు బహిరంగ ప్రదేశాలలో పడవేస్తే సహించేది లేదు!
విశాఖపట్నం: నగర పరిధిలో వ్యర్ధాలు సేకరణ శత శాతం జరగకపోతే ఉపేక్షించేది లేదని జీవీఎంసీ కమిషనర్ కేతన్ గార్గ్ జీవీఎంసీ ప్రజా ఆరోగ్యపు అధికారులను ఆదేశించారు. శుక్రవారం ఆయన క్షేత్రస్థాయి పర్యటనలో భాగంగా వెస్ట్ జోన్ 61వ వార్డు పరిధిలోని గొల్లలపాలెం తదితర ప్రాంతాలలో పారిశుద్ధ్య పనులను పర్యవేక్షించారు.
ఈ సందర్భంగా జీవీఎంసీ కమిషనర్ మాట్లాడుతూ వీధులలో, కాలనీలలో, రోడ్లపై , బహిరంగ ప్రదేశాలలో వ్యర్ధాలు పడవేయడం గమనించానని, పలు నివాసితులతో మాట్లాడుతూ నిత్యం గ్యాప్ వాహనాల రాకపోకలు, వారు అందిస్తున్న వ్యర్ధాలు ప్రక్రియపై పలువురును ఆరా తీశారు. జీవీఎంసీ పరిధిలో వ్యర్ధాల సేకరణ శత శాతం జరపకపోతే ఉపేక్షించేది లేదని, నిత్యం వ్యర్ధాల సేకరణ సరిగా జరపలేనందున వల్లనే గార్బేజ్ వల్నరబుల్ పాయింట్లు అధికమవుతున్నాయన్నారు. వ్యర్ధాలు బహిరంగ ప్రదేశాలలో పడవేయకుండా ప్రత్యేక కార్యచరణ చేపట్టాలని, నివాసితులకు ,వ్యాపారస్తులకు అవగాహన కల్పించాలని , అతిక్రమించిన వారికి జరిమానలను విధించాలని అధికారులను కమిషనర్ ఆదేశించారు. నిర్ణీత సమయానికే పారిశుద్ధ్య కార్మికులు, క్లాప్ వాహనాలు, లోడర్లు పిన్ పాయింట్ వారీగా విధుల్లో ప్రణాళికాయుతంగా బాధ్యతతో విధులు నిర్వహించాలని, అలాగే నివాసితులు ,వ్యాపారస్తులు వారి వ్యర్థాలను బహిరంగ ప్రదేశాల్లోను, రోడ్లపై, కాలనీలలో, కాలువలలోను వేస్తున్నారని అలాంటి వారిని గమనించి వారి నుండి అపరాధ రుసుము వసూలు చేయాలని అధికారులకు ఆదేశించారు.
ఇప్పటికే క్లాప్ వాహనాల ఏజెన్సీ ప్రతినిధులు, లోడర్ల సూపర్వైజర్లు, డ్రైవర్లతో సమీక్షలు నిర్వహించడం జరిగిందని, క్లాప్ వాహనాలు ప్రతిరోజు ఉదయం వ్యర్థాల సేకరణకు వెళ్లేటప్పుడు ప్రజల అవగాహన కొరకు తడి,పొడి వ్యర్ధాల విభజనకు మైక్ అనౌన్స్మెంట్ తోపాటు విజిల్ తప్పనిసరిగా ఉపయోగించి శతశాతం వ్యర్ధాల సేకరణ జరిగేలా చర్యలు తీసుకోవాలని జివిఎంసి అదనపు కమిషనర్ పి. నల్లనయ్య, ప్రధాన వైద్యాధికారి డాక్టర్ ఈ ఎన్ వి నరేష్ కుమార్, జోనల్ కమిషనర్లను ఇతర ప్రజా ఆరోగ్యపు అధికారులను కమిషనర్ ఆదేశించారు.
రానున్న వర్షాకాలం దృష్టిలో ఉంచుకొని నగరములో ఉన్న ప్రధాన గెడ్డలు కాలువలు లోని వ్యర్థాలను ఎప్పటికప్పుడు తొలగించి మురుగనీరు సాఫీగా వెళ్లేలా చర్యలు చేపట్టాలని ప్రధాన వైద్యాధికారి ని ఆదేశించారు. వీధులు, కాలనీలను శుభ్రపరచి ఆ వ్యర్ధాలను వెనువెంటనే డంపింగ్ యార్డ్ కి తరలించేలా శానిటరీ ఇన్స్పెక్టర్లు, వార్డ్ సచివాలయం శానిటరీ కార్యదర్శులు చర్యలు చేపట్టాలని కమిషనర్ ఆదేశించారు.




