Visakhapatnam: రేపటి నుంచే అమరావతి ఛాంపియన్‌షిప్ పోటీలు!

Visakhapatnam: ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ప్రతిష్ఠాత్మకంగా నిర్వహిస్తున్న "అమరావతి ఛాంపియన్‌షిప్–2026" పోస్టరును జీవీఎంసీ కమిషనర్ కేతన్ గార్గ్ విశాఖపట్నంలో ఆవిష్కరించారు.

SHIVA, BHIMILI
Published on: 14 July 2026 7:11 PM IST
Visakhapatnam
X

Visakhapatnam: రేపటి నుంచే అమరావతి ఛాంపియన్‌షిప్ పోటీలు!

విశాఖపట్నం: ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ప్రతిష్ఠాత్మకంగా నిర్వహిస్తున్న "అమరావతి ఛాంపియన్‌షిప్–2026" ప్రచార కార్యక్రమంలో భాగంగా మహా విశాఖపట్నం నగరపాలక సంస్థ కమిషనర్ కేతన్ గార్గ్ మంగళవారం జీవీఎంసీ ప్రధాన కార్యాలయంలోని ఆయన ఛాంబర్ లో ఛాంపియన్‌షిప్ పోస్టరు ను జిల్లా క్రీడాభివృద్ధి అధికారి జూన్ గాలియట్ తో కలిసి ఆవిష్కరించారు.

ఈ సందర్భంగా జీవీఎంసీ కమిషనర్ మాట్లాడుతూ రాష్ట్ర ప్రభుత్వం క్రీడలకు అత్యంత ప్రాధాన్యతనిస్తూ నిర్వహిస్తుందని తెలిపారు. అమరావతి ఛాంపియన్‌షిప్–2026 యువతలో క్రీడాస్ఫూర్తిని పెంపొందించడంలో కీలక పాత్ర పోషిస్తుందని, ఈ పోటీల్లో విశాఖపట్నం జిల్లాకు చెందిన క్రీడాకారులు అధిక సంఖ్యలో పాల్గొని తమ ప్రతిభను చాటుకోవాలన్నారు. జూలై 15, 2026 నుంచి ఆగస్టు 26, 2026 వరకు జిల్లావ్యాప్తంగా అన్ని నియోజకవర్గాల పరిధిలో 12 క్రీడాంశాల్లో ఈ ఛాంపియన్‌షిప్ నిర్వహించనున్నట్లు ఆయన తెలిపారు.

ఈ కార్యక్రమంలో జీవీఎంసీ ఇంచార్జ్ స్పోర్ట్స్ డైరెక్టర్ ఇ. ఎ. అప్పలరాజు, ఇతర అధికారులు తదితరులు పాల్గొన్నారు.

SHIVA, BHIMILI

SHIVA, BHIMILI

Next Story