Bheemili: భీమిలి 3వ వార్డులో కూటమి జోరు: గంటా రవితేజ ప్రచారం!
Bheemili: జీవీఎంసీ 3వ వార్డు కూటమి అభ్యర్థి గాడు చిన్ని కుమారి లక్ష్మికి మద్దతుగా టీడీపీ యువనేత గంటా రవితేజ, జనసేన నేత పంచకర్ల సందీప్ ఇంటింటి ప్రచారం నిర్వహించారు.
Bheemili: భీమిలి 3వ వార్డులో కూటమి జోరు: గంటా రవితేజ ప్రచారం!
భీమిలి: జీవీఎంసీ 3వ వార్డులో కూటమి అభ్యర్థి గాడు చిన్ని కుమారి లక్ష్మి గారి విజయాన్ని కాంక్షిస్తూ టీడీపీ యువనేత గంటా రవితేజ గారు ఇంటింటి ప్రచారం నిర్వహించారు. ఈ సందర్భంగా వార్డులోని ప్రజలను నేరుగా కలుసుకుని, కూటమి అభ్యర్థికి మద్దతు తెలిపి విజయాన్ని అందించాలని కోరారు. ప్రజలతో మమేకమవుతూ కూటమి అభ్యర్థి విజయానికి నాయకులు, కార్యకర్తలు సమష్టిగా కృషి చేయాలని పిలుపునిచ్చారు.
ఈ ప్రచార కార్యక్రమంలో జనసేన భీమిలి నియోజకవర్గ సమన్వయకర్త పంచకర్ల సందీప్, టీడీపీ నాయకులు గంటా నూకరాజు, గొలగాని నరేంద్ర కుమార్ గారు, కనకాల అప్పలనాయుడు గారు, వానపల్లి సత్యారావు గారు, ఇతర కూటమి నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.




