Madhurawada: జీవీఎంసీ 6వ వార్డులో దూసుకెళ్తున్న పోతిన హనుమంతరావు!

Madhurawada: జీవీఎంసీ 6వ వార్డు వైఎస్సార్‌సీపీ అభ్యర్థి పోతిన హనుమంతరావు మధురవాడ పరిధిలోని రేవలపాలెంలో విస్తృతంగా ఇంటింటి ఎన్నికల ప్రచారం నిర్వహించారు.

JAI RAM, MADURAWADA
Published on: 22 Oct 2026 11:20 PM IST
Madhurawada
X

Madhurawada: జీవీఎంసీ 6వ వార్డులో దూసుకెళ్తున్న పోతిన హనుమంతరావు!

మధురవాడ: జీవీఎంసీ 6వ వార్డు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్పొరేటర్ అభ్యర్థి పోతిన హనుమంతరావు ఎన్నికల ప్రచారంలో దూసుకెళ్తున్నారు. బుధవారం రేవల పాలెం పరిధిలో విస్తృతంగా పర్యటించారు. రేవల పాలెంలో ప్రతి ఇంటికి వెళ్లి వైసీపీ ప్రభుత్వ హయాంలో జరిగిన అభివృద్ధిని వివరిస్తూ, ఫ్యాన్ గుర్తుకు ఓటు వేసి గెలిపించాలని ప్రజలను కోరారు. స్థానిక ప్రజలు ఆయనకు ఘన స్వాగతం పలికారు. మహిళలు హారతులు పట్టి, యువత జై కొడుతూ ప్రచారంలో పాల్గొన్నారు.

ఈ సందర్భంగా పోతిన హనుమంతరావు మాట్లాడుతూ... మధురవాడలో గత వైసీపీ హయాంలోనే అభివృద్ధి జరిగిందని, తాగునీరు, డ్రైనేజీ, రోడ్లు వంటి సమస్యలు తాము అధికారంలోకి వస్తే పూర్తిగా పరిష్కరిస్తామని హామీ ఇచ్చారు. తాను ఎల్లప్పుడూ ప్రజలకు అందుబాటులో ఉంటానని, వార్డును అభివృద్ధి పథంలో నడిపిస్తానని భరోసా ఇచ్చారు.

రేవల పాలెం వాసులు తమ సమస్యలను ఆయన దృష్టికి తీసుకెళ్లగా, వాటిని తప్పకుండా పరిష్కరిస్తానని హామీ ఇచ్చారు. ఈ కార్యక్రమంలో వార్డు ఇంచార్జ్‌లు, వైసీపీ నాయకులు, కార్యకర్తలు, అభిమానులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు.

JAI RAM, MADURAWADA

JAI RAM, MADURAWADA