Visakhapatnam: ఆస్తి పన్ను రాయితీ పొందేందుకు రేపే చివరి ఛాన్స్
Visakhapatnam: విశాఖపట్నం ఆస్తి పన్ను చెల్లింపుదారులకు ఏప్రిల్ 30 ఆఖరి రోజు. బకాయిలపై 50 శాతం వడ్డీ మాఫీ.
Visakhapatnam: ఆస్తి పన్ను రాయితీ పొందేందుకు రేపే చివరి ఛాన్స్
Visakhapatnam: ఆస్తి పన్ను చెల్లింపు దారులకు,గృహ యజమానులకు రాష్ట్ర ప్రభుత్వం కల్పించిన గొప్ప సదవకాశాలకు ఆఖరి రోజు ఏప్రిల్ 30వ తేదీ అని.., ఆస్తి పన్ను చెల్లింపుదారులు, గృహ యజమానులు 2026 మార్చి 31 వరకు ఉన్న ఆస్తిపన్ను బకాయిలు పై 50 శాతం వడ్డీ మాఫీ తో , అలాగే 2026-27 ఆర్థిక సంవత్సరము యొక్క ఆస్తి, ఖాళీ స్థలాల పన్నులను 5 శాతం రిబేటు తో ఆఖరి రోజు అయిన ఏప్రిల్ 30వ తేదీన చెల్లించుకునే సదవకాశాన్ని వినియోగించుకోవాలని జీవీఎంసీ కమిషనర్ కేతన్ గార్గ్ బుధవారం పత్రికా ప్రకటన ద్వారా తెలిపారు.
ఈ సందర్భంగా జీవీఎంసీ కమిషనర్ వివరిస్తూ..,మహా విశాఖపట్నం నగరపాలక సంస్థ పరిధిలోని గృహ యజమానులకు / ఆస్తిపన్ను చెల్లింపుదారులకు రాష్ట్ర ప్రభుత్వం కల్పించిన సదవకాశాలకు ఆఖరి రోజు ఏప్రిల్ 30వ తేదీ అయినందున ఆస్తిపన్ను చెల్లింపుదారులు, గృహ యజమానులు ఇప్పటివరకు ఉన్న ఆస్తిపన్నులను బకాయిలతో సహా ఏక మొత్తంలో చెల్లించి 50 శాతం వడ్డీ మాఫీను,
5 ఐదు శాతం రిబేట్లను పొందాలని జీవీఎంసీ కమిషనర్ తెలిపారు. ఆంద్రప్రదేశ్ ప్రభుత్వం తేది 31.03.2026 లోగా ఆస్తిపన్ను బకాయిలు ఏక మొత్తముతో ఒకేసారి చెల్లించిన వారికి 50 శాతం వడ్డీను మాఫీ చేసిందని,ఈ సదవకాశం వినియోగించుకొన లేకపోయిన ఆస్తిపన్ను చెల్లింపుదారులకు ఆఖరి రోజుగా 2026 ఏప్రిల్ 30వ తేదీలోగా చెల్లించుకునే సదవకాశాన్ని కల్పించడమైనదన్నారు .
అలాగే 2026-27 ప్రస్తుత ఆర్ధిక సంవత్సరమునకు సంబంధించిన ఆస్తి, ఖాళీ స్థలాల పన్నులను 2026 ఏప్రిల్ 30 లోగా చెల్లించిన వారికి 5 శాతం రిబేటు ను కూడా రాష్ట్ర ప్రభుత్వం కల్పించినదని, కావున ఆస్తిపన్ను చెల్లింపుదారులు, గృహ యజమానులు 2026-27 ప్రస్తుత ఆర్ధిక సంవత్సరం అనగా తేది 01.04.2026 నుండి తేది 31.03.2027 వరకు గల సంవత్సర కాలమునకు చెల్లించవలసిన ఆస్తి, ఖాళీ స్థలాల పన్నులను ఆఖరి రోజు అయిన2026 ఏప్రిల్ 30వ తేదీలోగా చెల్లించి 5 శాతం రిబేటు ను పొందవలసినదిగా కోరడమైనదన్నారు.
ఆస్తి పన్నుల చెల్లింపుల సౌకర్యార్థం జి.వి.యం.సి. సౌకర్యం కేంద్రములు ఏప్రిల్ 30వ తేదీ రాత్రి 10 గంటల వరకు పనిచేస్తాయని, సౌకర్యం కేంద్రాలలో నగదు /డి.డి./చెక్కు మరియు డెబిట్ /క్రెడిట్ కార్డుల ద్వారా మరియు జి.వి.యం.సి. వెబ్ పోర్టల్ వివరములు : gvmc.gov.in → epayment → property tax/vacant land tax → Assessment Number (New / old) & email id → enter tax amount → pay now. ద్వారా ఆస్తి పన్ను చెల్లింపు దారులు, గృహ యజమానులు ఆస్తి పన్నులను చెల్లించుకోవచ్చునని కమిషనర్ తెలిపారు.




