Madhurawada: జీవీఎంసీ 8వ వార్డులో కూటమి అభ్యర్థి పిల్లా రేవతి ప్రచారం!
Madhurawada: జీవీఎంసీ 8వ వార్డు కూటమి టీడీపీ అభ్యర్థి పిల్లా రేవతి కలానగర్, ద్రోణంరాజు నగర్‌లో విస్తృతంగా ప్రచారం నిర్వహించారు. మౌలిక వసతుల కల్పనకు ప్రాధాన్యతనిస్తానని తెలిపారు.
Madhurawada: జీవీఎంసీ 8వ వార్డులో కూటమి అభ్యర్థి పిల్లా రేవతి ప్రచారం!
మధురవాడ: జీవీఎంసీ 8వ వార్డు కూటమి అభ్యర్థి, తెలుగుదేశం పార్టీకి చెందిన పిల్లా రేవతి సోమవారం సాయంత్రం కలానగర్, ద్రోణంరాజు నగర్ తదితర ప్రాంతాల్లో ఎన్నికల ప్రచారం నిర్వహించారు. ఇంటింటికీ వెళ్లి స్థానిక ప్రజలను కలుసుకుంటూ, వార్డు అభివృద్ధికి తనకు అవకాశం కల్పించాలని, ఎన్నికల్లో మద్దతు తెలిపి గెలిపించాలని అభ్యర్థించారు.
ప్రచారంలో భాగంగా స్థానికులతో మాట్లాడి వార్డులోని సమస్యలను అడిగి తెలుసుకున్నారు. ప్రజల అవసరాలను గుర్తించి, వార్డు అభివృద్ధికి కృషి చేస్తానని పిల్లా రేవతి తెలిపారు. ప్రజలకు మెరుగైన మౌలిక సదుపాయాలు కల్పించడమే తన ప్రాధాన్యమని పేర్కొన్నారు.
ఈ సందర్భంగా పలు ప్రాంతాల్లో స్థానికులు ఆమెకు స్వాగతం పలికారు. ప్రచార కార్యక్రమంలో తెలుగుదేశం పార్టీ, కూటమి నాయకులు, కార్యకర్తలు, అభిమానులు పాల్గొన్నారు.




