Madhurawada: గంభీరం రిజర్వాయర్ వద్ద రక్షణ చర్యలు చేపట్టాలి
Madhurawada: విశాఖపట్నం మధురవాడ సమీపంలోని గంభీరం రిజర్వాయర్ యువత పాలిట మృత్యుకుహరంగా మారింది.
Madhurawada: గంభీరం రిజర్వాయర్ వద్ద రక్షణ చర్యలు చేపట్టాలి
మధురవాడ: విశాఖ నగరానికి ప్రధాన తాగునీటి వనరుగా,ప్రముఖ పర్యాటక ప్రాంతంగా ఉన్న గంభీరం రిజర్వాయర్ ప్రస్తుతం యువత పాలిట మృత్యుకుహరంగా మారుతోంది. ప్రకృతి అందాలకు మురిసి,ఈత సరదా కోసం ఇక్కడికి వస్తున్న మధురవాడ, ఆనందపురం, భీమిలి పరిసర ప్రాంతాల విద్యార్థులు, యువకులు లోపల ఉన్న నీటి ఊబిల వల్ల ప్రాణాలు కోల్పోతున్నారు.
ఈ జలాశయంలో నెలకు సగటున ముగ్గురు చొప్పున, ఏడాదికి పదుల సంఖ్యలో యువకులు జలసమాధి అవుతుండటం తీవ్ర ఆందోళన కలిగిస్తోంది. ఇంతటి ఘోరాలు జరుగుతున్నా ఇక్కడ కనీస ప్రమాద హెచ్చరిక బోర్డులు గానీ, రక్షణ సిబ్బంది గానీ లేకపోవడంపై స్థానికులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.
అధికారులు, పోలీసులు, జిల్లా కలెక్టర్ తక్షణమే స్పందించి గంభీరం రిజర్వాయర్ వద్ద భద్రతను పెంచాలని, ఈతను పూర్తిగా నిషేధించి కఠిన చర్యలు తీసుకోవాలని పౌర సమాజం డిమాండ్ చేస్తోంది. యువత సైతం క్షణికానందం కోసం ప్రాణాల మీదకు తెచ్చుకోవద్దని స్థానిక ప్రజలు కోరుతున్నారు.




