Anakapalli: హాకీ ఆసియా కప్ లో ప్రతిభ కనిబరిన నమ్మి గీతాశ్రీకు అభినందన సభ
Anakapalli: జపాన్‌లో జరిగిన అండర్-18 బాలికల హాకీ ఆసియా కప్ టోర్నమెంట్‌లో కాంస్య పతకం, ‘ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్’ అవార్డు సాధించిన నక్కపల్లి మట్టి బిడ్డ.
Anakapalli: హాకీ ఆసియా కప్ లో ప్రతిభ కనిబరిన నమ్మి గీతాశ్రీకు అభినందన సభ
Anakapalli: పల్లెటూరి నుండి వెళ్లి భారతదేశం తరుపున హాకీ ఆసియా కప్ లో ప్రతిభ కనిబరిన నమ్మి గీతాశ్రీకు అభినందన సభ ఏర్పాటు చేశారు. ఈ రోజు నక్కపల్లి హాకీ గ్రౌండ్ లో ఏర్పాటు చేసిన అభినందన సభలో భారతదేశం తరుపున జపాన్ దేశంలో ఏర్పాటు చేసిన అండర్ 18 బాలికల హాకీ ఏషియా కప్ టోర్నమెంటులో 3వ స్తానం సాధించి,
ప్లేయర్ ఆఫ్ మాచ్ అవార్డు కూడా తీసుకున్న గీతాశ్రీ పలువురు నాయకులు సాలువతో సన్మానించారు.అడ్డురోడ్డు గీతాశ్రీ ఇంటి నుండి నక్కపల్లి హాకీ గ్రౌండ్ వరకు భారీ ర్యాలీగా గీతాశ్రీను అభినందన సభకు తీసుకొచ్చారు.
మన దేశానికి వన్నె తీసు కొచ్చిన ఈ మట్టిలో మణిక్యానికి దేశం తరుపున, మన నియోజకవర్గం కృతజ్ఞతలు తెలుపుతున్నామని నాయకులు అన్నారు. ఇలాగే క్రీడలపై మక్కువ ఉన్న క్రీడాకారులు అందరూ కష్టపడితే దేశానికి పేరు తీసుకు రావాలని కోరారు.




