Anakapalli: నూకాంబిక అమ్మవారిని దర్శించుకున్న ఐఏఎస్ అధికారి చక్రధర్ రావు

Anakapalli: డైరెక్టర్ ఆఫ్ సెకండరీ హెల్త్, ఐఏఎస్ అధికారి కే. చక్రధర్ రావు అనకాపల్లి నూకాంబిక అమ్మవారిని కుటుంబ సమేతంగా దర్శించుకుని ప్రత్యేక పూజలు చేశారు.

NAGA SRINIVASARAO,	ANAKAPALLI
Published on: 12 Oct 2026 8:28 PM IST
Anakapalli
X

Anakapalli: నూకాంబిక అమ్మవారిని దర్శించుకున్న ఐఏఎస్ అధికారి చక్రధర్ రావు

అనకాపల్లి: ఉత్తరాంధ్ర ఇలవేల్పుగా ప్రసిద్ధిగాంచిన అనకాపల్లి గవరపాలెంలోని శ్రీశ్రీశ్రీ నూకాంబిక అమ్మవారి దేవస్థానంలో జరుగుతున్న శరన్నవరాత్రి మహోత్సవాలు భక్తిశ్రద్ధలతో కొనసాగుతున్నాయి. ఈ సందర్భంగా సోమవారం డైరెక్టర్ ఆఫ్ సెకండరీ హెల్త్, ఐఏఎస్ అధికారి కే. చక్రధర్ రావు కుటుంబ సమేతంగా అమ్మవారిని దర్శించుకుని ప్రత్యేక పూజలు నిర్వహించారు.

ఆలయానికి చేరుకున్న చక్రధర్ రావుకు అనకాపల్లి జనసేన పార్టీ నియోజకవర్గ ఇన్‌ఛార్జి భీమరశెట్టి రాంకీ సాదరంగా స్వాగతం పలికారు. అనంతరం దేవస్థానం సిబ్బంది పూర్ణకుంభంతో సంప్రదాయబద్ధంగా స్వాగతం పలికారు.

ఈ సందర్భంగా చక్రధర్ రావు కుటుంబ సభ్యులతో కలిసి అమ్మవారిని దర్శించుకుని శరన్నవరాత్రి ఉత్సవాల ప్రత్యేక పూజల్లో పాల్గొన్నారు. అమ్మవారికి పట్టు వస్త్రాలు సమర్పించి, కుంకుమార్చన నిర్వహించారు. ఆలయ అర్చకులు వేద మంత్రోచ్ఛారణల నడుమ ఆశీర్వచనం అందజేసి, అమ్మవారి పట్టు వస్త్రాలను అందించారు. అనంతరం చక్రధర్ రావు కుటుంబ సభ్యులు అమ్మవారి తీర్థప్రసాదాలను స్వీకరించారు.

ఈ కార్యక్రమంలో నూకాంబిక అమ్మవారి దేవస్థానం చైర్మన్ పీల నాగశీను, ఆలయ ఈవో వై. శ్రీధర్, ఆలయ డైరెక్టర్లు, కూటమి నాయకులు, దేవస్థానం సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.

NAGA SRINIVASARAO,	ANAKAPALLI

NAGA SRINIVASARAO, ANAKAPALLI