Visakhapatnam: విశాఖ జూలో సందడి: కొత్తగా 120కి పైగా జంతువులు, పక్షుల జననం!
Visakhapatnam: విశాఖపట్నంలోని ఇందిరా గాంధీ జూలాజికల్ పార్క్ (IGZP)లో చేపట్టిన సంరక్షణ కార్యక్రమాలు సత్ఫలితాలనిచ్చాయి.
Visakhapatnam: విశాఖ జూలో సందడి: కొత్తగా 120కి పైగా జంతువులు, పక్షుల జననం!
విశాఖ: విశాఖ ఇందిరా గాంధీ జూలాజికల్ పార్క్‌లో చేపడుతున్న సంరక్షణ, పునరుత్పత్తి కార్యక్రమాలు విశేష ఫలితాలనిస్తున్నాయి. గత కొన్నివారాల్లో జూలో వివిధ జాతులకు చెందిన 120కి పైగా పక్షులు,జంతు పిల్లలు జన్మించాయని జూ క్యూరేటర్ జి.మంగమ్మ ఒక ప్రకటనలో తెలిపారు.జన్మించిన కొత్త సభ్యుల వివరాలు.. బైసన్ 1, స్టార్ తాబేళ్లు40, అడవి పందులు35, చుక్కల జింకలు20, ఎర్ర అడవి కోళ్లు (రెడ్ జంగిల్ ఫౌల్)10,
సాంబర్ జింకలు5,భారతీయ నెమళ్లు4, చారల హైనా పిల్లలు3, భారతీయ ముళ్లపందులు2, బూడిద రంగు పెలికాన్లు2,మార్మోసెట్స్2, బ్లూ-గోల్డ్ మకావ్ 1,శాస్త్రీయ పద్ధతులు ప్రత్యేక సంరక్షణ..జూ పశువైద్య బృందం కృత్రిమ పొదిగింపు విధానం ద్వారా రెడ్ జంగిల్ ఫౌల్ గుడ్లను 21రోజుల పాటు పర్యవేక్షించి10 పిల్లలను,బ్లూ-గోల్డ్ మకావ్ గుడ్డును ఇంక్యుబేటర్‌లో నిర్దిష్ట ఉష్ణోగ్రత వద్ద ఉంచి విజయవంతంగా పొదిగించారు.ప్రపంచంలోనే అతిచిన్న కోతి జాతి అయిన మార్మోసెట్ తో ,ఐ.యు.సి.న్ రెడ్ లిస్ట్‌లో ఉన్న చారల హైనా కూడా పిల్లలకు జన్మనిచ్చాయి.ప్రస్తుతం ఈకొత్త జీవులన్నీ వెటర్నరీ బృందం పర్యవేక్షణలో ఆరోగ్యంగాఉన్నాయని, సందర్శకులు వీటిని జూలో చూడవచ్చని క్యూరేటర్ జి.మంగమ్మ వెల్లడించారు.




