Visakhapatnam: విశాఖలో ఇండియన్ నేవీ అగ్నివీర్ నియామక ర్యాలీ ప్రారంభం!
Visakhapatnam: ఆర్కే బీచ్ రోడ్డులో ఇండియన్ నేవీ అగ్నివీర్ ఎంపికలు ప్రారంభమయ్యాయి. ఈ నెల 20 వరకు జరిగే ఈ ర్యాలీలో తొలిరోజు 725 మంది అభ్యర్థులు ఫిజికల్ రన్నింగ్ టెస్ట్‌లో పాల్గొన్నారు.
Visakhapatnam: విశాఖలో ఇండియన్ నేవీ అగ్నివీర్ నియామక ర్యాలీ ప్రారంభం!
Visakhapatnam: విశాఖనగరంలో ఇండియన్ నేవీ అగ్నివీర్ నియామక ర్యాలీ ప్రారంభమైంది. ఈనెల 20 వరకు కొనసాగనున్న ఈ ఎంపికల్లో భాగంగా తొలిరోజు 725 మంది అభ్యర్థులు 1.6 కిలోమీటర్ల ఫిజికల్ రన్నింగ్ టెస్ట్‌లో పాల్గొన్నారు.
ఆర్కే బీచ్ రోడ్డులోని ది పార్క్ హోటల్ జంక్షన్ నుండి విశ్వప్రియ ఫంక్షన్ హాల్ వరకు ప్రత్యేక రన్నింగ్ ట్రాక్‌ను ఏర్పాటు చేశారు. అర్ధరాత్రి 1:00 గంటల నుంచే అభ్యర్థులు బీచ్ రోడ్డులో క్యూ లైన్లలో వేచి ఉండగా,తెల్లవారుజామున 5:00 గంటల వరకు పరుగు పందెం నిర్వహించారు. ప్రతీ బ్యాచ్‌లో 100మంది చొప్పున అభ్యర్థులను రేస్‌లోకి అనుమతించారు.
Next Story




