Visakhapatnam: నవంబర్ 29న విశాఖలో డా. బీఎస్ రెడ్డి అంతర్జాతీయ స్థాయి మ్యాజిక్ షో!

Visakhapatnam: ప్రముఖ ఇంద్రజాలికుడు డా. బీఎస్ రెడ్డి నేతృత్వంలో నవంబర్ 29న విశాఖలోని గురజాడ కళాక్షేత్రంలో అంతర్జాతీయ స్థాయి మ్యాజిక్ షో. కుటుంబ సమేతంగా వీక్షించేలా వినోదాత్మక ప్రదర్శన.

Anuradha, Sr. Staff Reporter -Vishakapatnam
Published on: 26 Nov 2026 8:59 AM IST
Visakhapatnam
X

Visakhapatnam: నవంబర్ 29న విశాఖలో డా. బీఎస్ రెడ్డి అంతర్జాతీయ స్థాయి మ్యాజిక్ షో!

Visakhapatnam: ప్రముఖ ఇంద్రజాలికుడు, ‘ఇండియాస్ గాట్ ట్యాలెంట్’ గ్రాండ్ ఫైనలిస్ట్ డా. బీఎస్ రెడ్డి నేతృత్వంలో విశాఖలో అంతర్జాతీయ స్థాయి ఇంద్రజాల ప్రదర్శన ఈ నెల 29న నిర్వహించ నున్నారు. ఈ కార్యక్రమానికి సంబంధించిన వివరాలు విశాఖలో ఓ హోటల్లో మీడియా సమావేశంలో మీడియాకు వివరాలు ఇండియన్ మ్యాజిక్ అకాడమీ వ్యవస్థాపకుడు,బి ఎస్ రెడ్డి, నిర్వాహకులు మీడియాకు తెలిపారు.

ఈ కార్యక్రమాన్ని EMA వైజాగ్ అందిస్తోందని ఈ ప్రదర్శన నవంబర్ 29, ఆదివారం సాయంత్రం 6 గంటలకు సిరిపురంలోని గురజాడ కళాక్షేత్రంలో జరగనుందన్నారు. ప్రదర్శన సుమారు రెండు గంటలు కొనసాగుతుందన్నారు.

ఈ ప్రదర్శనలో వస్తువుల కనిపించడం,అదృశ్యమవడం, రూపాంతరం, అసాధ్యమైన చేతలు, అద్భుత ఇల్యూజన్లు ఉంటాయన్నారు.పిల్లలు, తల్లిదండ్రులు, తాతామామలతో సహా కుటుంబ సభ్యులందరికీ అనుకూలంగా రూపొందించిన వినోదాత్మక కార్యక్రమం అన్నారు. మీడియా సమావేశంలో నిర్వాహకులుపాల్గొన్నారు.

Anuradha, Sr. Staff Reporter -Vishakapatnam

Anuradha, Sr. Staff Reporter -Vishakapatnam

విశాఖపట్నంలో 25 ఏళ్లకు పైగా నిఖార్సైన జర్నలిజం ప్రయాణం. వైజాగ్ ప్రాంతీయ సమస్యలపై ప్రత్యేక విశ్లేషణలు అందించే ‘సీనియర్ స్టాఫ్ రిపోర్టర్’.