Yalamanchili: ఎలమంచిలి 20వ వార్డులో ఘనంగా 'ఇంటింటా తెలుగుదేశం'!
Yalamanchili: ఎలమంచిలి 20వ వార్డులో 'ఇంటింటా తెలుగుదేశం' నిధుల పంపిణీ, సంక్షేమ పథకాల వివరణ. పాల్గొన్న టీడీపీ పట్టణ అధ్యక్షుడు గొర్లె శివన్నారాయణ (నానాజీ).
Yalamanchili: ఎలమంచిలి 20వ వార్డులో ఘనంగా 'ఇంటింటా తెలుగుదేశం'!
Yalamanchili: ఈరోజు ఉదయం 10 గంటలకు ఎలమంచిలి మున్సిపాలిటీ 20వ వార్డు ఇంటింటా తెలుగుదేశం కార్యక్రమం నిర్వహించడం జరిగింది . ఈ కార్యక్రమంలో పట్టణ పార్టీ అధ్యక్షులు గొర్లె శివన్నారాయణ ( నానాజీ) పాల్గొని ప్రతి ఇంటికి వెళ్లి ఈ రెండు సంవత్సరాల్లో జరిగిన అభివృద్ధి సంక్షేమ పథకాలు ప్రజలకు వివరించడం జరిగింది.
కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత సంక్షేమ కార్యక్రమాలు ప్రజలకు అందించడం జరిగిందని అభివృద్ధిలో ఎన్నో పరిశ్రమలు మన జిల్లాలో ఏర్పాటు చేయడం జరిగింది యువతకి ఉద్యోగ ఉపాధి అవకాశాలు రావడానికి ప్రభుత్వం ఎంతగానో కృషి చేస్తుంది.
ఈ కార్యక్రమంలో క్లస్టర్ ఇంచార్జ్ బోద్ధపు శ్రీనివాసరావు, వార్డ్ ఇంచార్జ్ బద్ధపు నాగేశ్వరరావు, యూత్ అధ్యక్షులు నమ్మి రమణ జనసేన వార్డు అధ్యక్షులు బోద్ధపు గణేష్, వార్డు సెక్రటరీ పందల సూరిబాబు, దాంట్ల విజయకుమార్, నాయకులు కార్యకర్తలు అభిమానులు పాల్గొన్నారు.




