Paderu: దళారుల మాటలు నమ్మి మోసపోవద్దు: పాడేరు ఐటీడీఏ పీవో!
Paderu: పాడేరు ఐటీడీఏ పరిధిలో ఉద్యోగాలు, ట్రైకార్ సబ్సిడీ రుణాల పేరుతో నిరుద్యోగులను మోసం చేసే దళారుల మాటలు నమ్మవద్దని పీవో ఆదిత్య వర్మ హెచ్చరించారు.
Paderu: దళారుల మాటలు నమ్మి మోసపోవద్దు: పాడేరు ఐటీడీఏ పీవో!
పాడేరు: అల్లూరి సీతారామరాజు జిల్లాలో పాడేరు ఐటిడిఏ పరిధిలో ఉన్న సంస్థలు(ట్రైబల్ మ్యూజియం,పద్మాపురం గార్డెన్,కాఫీ ప్రాజెక్ట్)నందు ఉద్యోగాలు, సబ్సిడీ రుణాలు(ట్రైకార్)ఇప్పిస్తాం అని కొందరు దళారులు నిరిద్యోగ యువతి యువకులను నమ్మపలికి వారి నుంచి డబ్బులు వసూలు చేసి వారిని మోసంచేస్తున్నారు.
అని మా దృష్టికి వచ్చింది. కావున నిరిద్యోగ యువతి యువకులు దళారుల మాటలువిని మోసపోవద్దు అని ఐటిడిఏ పరిధిలో ఏవిదమైన ఉద్యోగాలు భర్తీ చేయదలచి వచ్చిన, సబ్సిడీ రుణాలు(ట్రైకార్)ఇవ్వదలచిన అధికారిక ప్రకటన ద్వారా అందరకి తెలియజేసి అర్హతలు అన్ని పరిశీలించి అర్హులను ఎంపిక చేయడం జరుగుతుంది. ఈ విషయాని అందరు గమనించగలరని సమీకృత గిరిజన అభివృద్ధి సంస్థ,పాడేరు ప్రాజెక్ట్ అధికారి ఆదిత్య వర్మ ఒక ప్రకటన ద్వారా గిరిజన నిరుద్యోగులకు తెలియజేశారు.




