Visakhapatnam: సెంట్రల్ పార్క్ పనులు ఆపాలని జనసేన వినతి

Visakhapatnam: విశాఖ సెంట్రల్ పార్క్‌లో ఫుడ్ కోర్ట్ నిర్మాణ పనులను హైకోర్టు ఆదేశాల మేరకు నిలిపివేయాలని జనసేన నేత పీతల మూర్తి యాదవ్ కోరారు.

GOPI, PENDURTHI
Published on: 8 May 2026 5:13 PM IST
Visakhapatnam
X

Visakhapatnam

Visakhapatnam: విశాఖపట్నంలోని సెంట్రల్ పార్క్‌లో చేపడుతున్న ఫుడ్ కోర్ట్ నిర్మాణ పనులను హైకోర్టు ఉత్తర్వుల మేరకు వెంటనే నిలిపివేయాలని జనసేన నేత, మాజీ కార్పొరేటర్ పీతల మూర్తి యాదవ్ జీవీఎంసీ అధికారులను కోరారు.

శుక్రవారం జీవీఎంసీ పట్టణ ప్రణాళిక ఓపెన్ ఫోరంలో చీఫ్ సిటీ ప్లానర్ ప్రభాకర్‌కు హైకోర్టు ఉత్తర్వుల కాపీతో కూడిన వినతి పత్రాన్ని ఆయన అందజేశారు.

సెంట్రల్ పార్క్ ప్రహరీ గోడకు ఆనుకుని తూర్పు, పడమర, దక్షిణ వైపులా కొత్త దుకాణాల నిర్మాణానికి టెండర్లు పిలిచి పనులు ప్రారంభించారని ఆరోపించారు. వీఎంఆర్డీఏకు చెందిన 20 ఎకరాల సెంట్రల్ పార్క్ ప్రాంతంలో వాణిజ్య నిర్మాణాలకు అనుమతి లేదని, సుప్రీంకోర్టు ఆదేశాలు మరియు మాస్టర్ ప్లాన్‌లో కూడా ఈ విషయాన్ని స్పష్టం చేశారని గుర్తుచేశారు.

ఈ అంశంపై ఆంధ్రప్రదేశ్ హైకోర్టులో డబ్ల్యూపీ నెంబర్ 13090/2026 కింద పిటిషన్ దాఖలు చేసినట్లు తెలిపారు. ఈ కేసును విచారించిన న్యాయస్థానం, తదుపరి ఆదేశాలు వచ్చే వరకు జూలై 28 వరకు స్టేటస్ కో పాటించాలని జీవీఎంసీ అధికారులకు ఆదేశాలు జారీ చేసినట్లు పేర్కొన్నారు.

అయితే కోర్టు ఆదేశాలు ఉన్నప్పటికీ పనులు యథావిధిగా కొనసాగుతున్నాయని, ఇది కోర్టు ధిక్కరణ కిందకు వస్తుందని పీతల మూర్తి యాదవ్ ఆరోపించారు. వెంటనే పనులు నిలిపివేసి న్యాయస్థాన ఆదేశాలను అమలు చేయాలని డిమాండ్ చేశారు.

GOPI, PENDURTHI

GOPI, PENDURTHI

Next Story