Anakapalli: పవన్ కళ్యాణ్ కోలుకోవాలని ప్రత్యేక పూజలు
Anakapalli: అనకాపల్లి జిల్లాలో పవన్ కళ్యాణ్ ఆరోగ్యం కోసం జనసేన నాయకులు ఆంజనేయ స్వామి ఆలయంలో ప్రత్యేక పూజలు నిర్వహించారు.
Anakapalli
Anakapalli: అనకాపల్లి జిల్లాలో ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి, జనసేన పార్టీ అధ్యక్షుడు కొణిదల పవన్ కళ్యాణ్ త్వరగా కోలుకోవాలని కోరుతూ జనసేన నాయకులు, కార్యకర్తలు ప్రత్యేక పూజలు నిర్వహించారు.
అడ్డురోడ్డు జంక్షన్‌లోని శ్రీ ఆంజనేయ స్వామి ఆలయంలో ఈ పూజలు నిర్వహించారు. పవన్ కళ్యాణ్ ఆయురారోగ్యాలతో త్వరగా కోలుకోవాలని దేవుడిని ప్రార్థించారు.
ఈ కార్యక్రమంలో జనసేన నాయకులు, జనసైనికులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు. సేనాపతి బాబురావు, మాస్టారు అప్పికొండ లవ రాజు, గుర్రం ధన, బోండా కృష్ణ, ఎర్ర మాధవ్, ఎర్ర శ్రీను తదితరులు పాల్గొన్నారు.
Next Story




